పుట:KutunbaniyantranaPaddathulu.djvu/107

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 107

కునే మాత్రలకంటే ముక్కు పొరల్లో అమర్చిన ప్రొజస్టిరోస్ సెరెబ్రోయినల్ ఫ్లూయిడ్‌లో 10-100 రెట్లు కనబడింది. ఈ ఫలితాలే మానవ ప్రయోగాల్లోకూడ విజయవంతమైనట్లయితే చాలా తక్కువ మోతాదులో హార్మోన్లు సరిపోతాయి. తక్కువ మోతాదులో హార్మోన్లు సరిపోయినపుడు వాటి దుష్పలితాలు కూడా చాలా తక్కువ ఉంటాయి.

ప్రోస్టాగ్లాండిన్స్ E2, F2 అల్ఫాకాంపౌండ్సు గర్భస్రావానికి తోడ్పడతాయి. ప్రోస్టాగ్లాండిన్స్‌కూడా ఏ విధంగా తోడ్పడతాయనే విషయంలో విస్త్రుత పరిశోధన జరుగుతోంది.

ఇమ్యునొలాజికల్ పంధా కూడా ఫామిలీ ప్లానింగ్ విషయంలో ఆలోచించడం జరుగుతోంది. ఫాలికుల్ స్టిమ్సు లేటింగ్ హార్మోను మగవాళ్ళల్లో వీర్యకణాల ఉత్పత్తికి, వృద్ధికీ తోడ్పడుతుంది. అందుకని ఈ హార్మోనుకి యాంటీగా (వ్యతిరేకంగా) పదార్ధాలని శరీరంలో ప్రవేశపెట్టినట్లయితే వీర్యకణాల ఊత్పత్తి లేకుండా చేయవచ్చుననే ఒక ఆలోచన ఉంది.

శాశ్వత సంతాన నిరోధ పద్ధతులుగా వాసెక్టమీ, ట్యూబెక్టమీ పద్ధతులు ఆచరణలో ఉన్నాయి. ఆపరేషనుతో సంబంధం లేకుండా, ఆయా ట్యూబులని కత్తిరించకుండా శరీరంలోకి ఒక ప్రత్యేక పదార్ధం ఇంజేక్ట్ చేసి ఆ