పుట:KutunbaniyantranaPaddathulu.djvu/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గడిచినా ఆయా దేశాల జనాభా పెరగకుండా నిలకడగా ఉంది. అదే అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందవలసిన దేశాల విషయం తీసుకుంటే ఎటువంటి హద్దూ, అదుపు లేకుండా జనాభా పెరిగిపోతుంది. అందుకనే ఆయా దేశాల ప్రభుత్వాలు ప్రజల సౌకర్యం కోసం ఎన్ని పనులు చేసినా, ఎన్ని అవకాశాలు కల్పించినా ఏమీ చేయనట్టే అనిపిస్తుంది.

ఈనాడు ప్రపంచ జనాభా సుమారు 500 కోట్లు. ఏటా 75 నుండి 80 మిలయన్ల జనాభా పెరుగుతూ వస్తోంది. పెరుగుతున్న ఈ వేగం బట్టి చూస్తే ఇంకో పాతిక సంవత్సరాల్లో ప్రపంచ జనాభా ఇపుడు ఉన్న జనాభాకి రెట్టింపు అయ్యే ప్రమాదం ఉంది.

అంతవరకెందుకు పెరుగుతున్న మన భారతదేశ జనాభానే చూస్తే పరిస్థితి అర్ధమవుతుంది. 1981 జనాభా లెక్కల ప్రకారం మన దేశ జనాభా 68 కోట్ల 50 లక్షలు. 1971 జనాభా లెక్కల ప్రకారం ఆనాటి దేశ జనాభా 54 కోట్లు, అంటే పది సంవత్సరాల వ్యవధిలోనే 14 కోట్లు జనాభా పెరిగిపోయింది.

మన దేశ జనాభా ఎంత విపరీతంగా పెరిగి పోతోందంటే ఈ శతాబ్దం ఆరంభంలో 23 కోటల 80 లక్షలు. మరి 1981 సంవత్సరం వచ్చేనాటికి 68 కోట్ల యాభై లక్షలు అయిపోయింది.