పుట:Kumbharaana020881mbp.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

50 కవికోకిల గ్రంథావళి [స్థలం ఏడు

లేదు, ద్వేషించుటయులేదు. ఒకప్పుడు తాను వంచించు మాటల ఫలితమును యోచింపలేనంత అమాయికగ నగపడును. ఆకాంత యొనరించు ప్రతికార్యమును తనకు నైసర్గికమైనట్లె తోఁచుచుండును. ఏదియో యొక బలాత్కార శక్తి తన్ను నన్నుండి యాకర్షించుకొన్నట్లు నిస్సహాయమై వర్ణించుచుండును. [మఱల సోఫాలో కూర్చుండును.]

మీరాను పరిత్యజింపఁజాలను. ప్రణయమంజులమైన గతజీవితస్మృతి నాసంకల్పమున కడ్డుపడుచున్నది. ఎప్పటికైనను మీరాను నావంకకు త్రిప్పుకొనగలనను నమ్మకము గలదు.

[బలవంతరావు ప్రవేశించును]

బలవంతరావు : జయము, జయము ధర్మప్రభువులకు!

రాణా : కూర్చుండుము - మీరా ఇపు డెట్లున్నది?

బల : [కూర్చుండి] నిన్నటివలెనే యున్నది. ఔషధ సేవనము వలన ప్రయోజనమేమియు నగపడుటలేదు. దైవానుకూలముగ నా కొక విషయము జ్ఞప్తికి వచ్చినది. భూతచికిత్స చేయించి వేయిమంది సద్భ్రాహ్మణులకు షడ్రసోపేతముగ సంతర్పణ చేయించి, శాంతిచేసిన యడల రాణిగారికి తప్పక జాడ్యము కుదురును !

రాణా : [విసుగుచూపుచు, స్వగతము] ఇతఁడు పురాణ పురుషుఁడు. ఇతని ఇప్పటి యోగ్యత వార్థక్యమే !

బల : భేతాళుని ఆజ్ఞలోనుండి అప్పుడప్పుడు కొన్నిపిశాచములు తప్పించుకొని, భూలోకమునకువచ్చి ప్రజలను బాధపెట్టుచుండునని మంత్రశాస్త్రవేత్తలు చెప్పుదురు. అవి పట్టినప్పుడు ఆవేశమునచ్చినట్లూ, పిచ్చిపట్టినట్లూ ఉండేదికలదు. భల్లూకశాస్త్రులవారు శాతపొడి మంత్రములలో -

రాణా : [విసుగుతో] ఇస్ - ఇఁక చాలింపుము ! ఎంతతెలివి