పుట:Kumbharaana020881mbp.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్థలం ఐదు] కుంభ రాణా 45

లాగేవుంది. నాకేం పిచ్చిపట్టలేదు. - వైద్దుగులు మందైనా యియ్యకుండా వెళ్ళిపొయ్యారె. - [హారమును చూచి ఆశ్చర్యముతో] ఆ! యిదేంటి చుక్కల దండలాగా మెరుస్తుంది. [నలుప్రక్కలు పరికించి] ఇక్కడ యెవ్వరూలేరు. రాణిగారు కన్నుమాల్చివున్నారు. [హారముతీసికొని] వైద్దుగులు చూచివుంటె తట్టేసివుండేవాళ్ళే. దీన్ని దొంగిలిస్తే దేవుడుకూడా కనుక్కోలేడు. [అటునిటుచూచి ఱవికెలో దోపుకొనును]

మీరా : [మెల్లగా కనులెత్తి] ప్రాణవల్లభా, యీవిరహణిని నీవు పరిత్యజించితివి. ఇఁక నే జీవించియుండలేను. ప్రాణపరిత్యాగము చేసికొందును. ఈ హత్యాపాతకము నిన్నుఁదప్పక చుట్టుకొనును. [తన్నుఁజూచుకొని యుల్కిపడిలేచి] హా! ఇదియేమివింత ! నేనే కృష్ణుఁడను ! - మా కిరువురకు నభేధ ప్రతిపత్తి గలిగినది ! - ఈ చరాచర భూతసృష్టియంతయు నేనే ! - నేను లేనిదియు నేను కానిదియు నొక్కటియైన కనఁబడదు ! అంతయు నేనే - నేనే - నేనే - నే - నే...

[మూర్చిల్లును; సుశీల ఆనుకొని పట్టుకొనును]

[తెరజాఱును.]