పుట:Krxshhiivaludu (1924).pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఫల మనుభవించువారలు పరులు; నీకు
గట్టకుడువను గఱవె యెక్కాలమందు. 70


ఫలము ల్మెక్కెడివారు తత్ఫల రసాస్వాదక్రియాలోలురై
పలుమా ఱమ్మధురత్వము న్నుతుల సంభావింతురేగాని, త
త్ఫల హేతుక్రమవృక్షముం దలపరెవ్వారైన, నట్లే రమా
కలితు ల్భోగములన్‌ భుజించుచు నినుం గన్నెత్తియుంజూతురే? 71

అట్టి కృతఘ్నులన్‌ మనమునందు దలంపక సేద్యనాద్యపున్‌
ఘట్టన నస్థిపంజరముగా తనువెండినగాని, వర్షముల్‌
పట్టినగాని, క్షామములు వచ్చినగాని శరీరసత్వమే
పట్టుగ స్వశ్రమార్జితము పట్టెడు నన్నము దిందు వెప్పుడున్‌! 72

రాజకీయ ప్రపంచ సామ్రాజ్యమందు
శౌర్యఖడ్గంబులకు లేదు శాసనంబు;
సంఘరాజ్యంబు నేలు విస్తారశక్తి
సతము నాచార ఘోర పిశాచరాజు; 73

శౌర్యమునకు నాచార చక్రమునకు
మధ్య, లోకంబు దవిలి సమ్మథితమగును;
కాలగర్భంబునం దెట్టి ఘటనగలదొ
పూర్వ పద్ధతి విప్లవ స్ఫురణగొలుప! 74