పుట:Kavitvatatvavicharamu.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

 ద్వితీయ భాగము 155

గలుగకున్నఁ దనకు మోక్షము గలుగదని యేమో ! ఈ దౌర్భాగ్యపు

టల్లుఁడు తోఁటలోనైనఁ గృషి చేసి ప్రయోజకుడు గానీ యని
యూ తనిని బూఁదోటలో మాలిపనికి నియోగించెను ! శాలీనుఁడు
సత్వగుణుఁడు. చెప్పినదంతయుఁజేసి రచ్చలేక యుందమ నెడు
వాcడు . మరియు , ఇల్లటపలఁడు అట్టి యల్లురకు మర్యాదలెక్కువ
యుండు నా ? ఒక్క భేదముఁ జెందక నిత్యము తోఁటపనులం
జేయుచుండెను. అప్పడు సుగాత్రి—

తే. తల్లిమాటలచే నిట్లు తన విభుండు తనువు బడలఁగ బూఁదోఁట పనులు సేయఁ

జూడనోర్వక తాను నచ్చోటికరిగి
తోడుపడియెద నని చూచు ప్రీడ నుడుగు.
                                                       (కళా. ఆ. 4, ప. 84.)
       పిమ్మటC గొన్నాళ్ళకు లజ్జC బాయఁద్రోచి పురుషునకు సహా
యముగఁ దా నును దోcటపనులను జేయ

"ఊ ................................. . . . . . . . . . . . . . . ఎప్పటియట్ల యటంకృతాంగియై

యెంతయు నింపుతోడఁ జనియెన్ బ్రియుఁడున్న వనంబులోనికిన్
                                                                        (ప. 94)
క. చనియూతఁడు దా సలిపెడు
పనులకు నీయకొనకున్న బలిమిఁ గడంగెన్
దన సొమ్ములెల్ల నొక మఱు 

గున నిడి పిరిసుట్టు సుట్టికొనిన వలువతోన్. 95

సీ. తోరంపుఁ జనుదోయి త్రుళ్ళింతల నిడంగఁ

                     దగుచోట్ల గుద్దంటఁ ద్రవ్విత్రవ్వి

వ్రేఁగైన పిఅుదు బల్విడిఁ జలిం పంగను

                 వడినిట్టునట్టును నడిచి నడిచి

యడుసుతుంపరు చెక్కుటద్దంబులను బర్వ

         మళ్ళకు మడవలు మార్చి మార్చి

నడుములేఁదీవియ నకనకల్గుడువనిం

             పునఁదగు మోఁపులు మోసి మోసి

చిఱుచెమటచేర్చు వింతక్రొమ్మెఱుఁగుతోడఁ

గొమురు మేనొప్ప సారెకుఁ గొప్పవదల