పుట:Kavitvatatvavicharamu.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

106 కవిత్వతత్త్వ విచారము

నాకన్యలు "ఎక్కడిద్వారక, ఎక్కడి గద సాంబు లిదివిన్నఁ బెను చేటు స్వామి చేత, నసురులకుఁ బగవీడఁట యాపురంబు" అని. యాశీర్వాద బలముచే వెల్లివిరిసిన తమి "భోగయోగ్యమగు ప్రాయము" నకు మున్నే తమ్ముఁ దొందర పెట్టఁ జాలఁ బరిత పించిరట ! ఋషుల యాదేశము విన్నమాత్రన మనసు చెప్పిన దిక్కునకుఁ ద్రిప్పుట, మనవారి సాధుగుణ మును వినయమును జూపు చిత్రమే మో ! భోగయోగ్యమగు ప్రాయము కుదరక మును పే పతిచింతందాల్చు సామర్థ్యము గలవా రౌ ట గాcబోలు, బాల్య వివాహములకు నిజమైన నిదానము ! ఈ విషయము లటుండ నిండు. ద్వారకాపురిలోని గదసాంబు లంగూర్చి సునాభుని కూఁతు లకుఁ దెలిసిన యా మాత్రము వారియక్క గారైన ప్రభావతికిఁ దెలియక పో నేల ? ప్రద్యుమ్నుఁడు భర్తయని యెఱింగియు దిక్కు లేని పక్షి రీతి నా పె రోదనముఁ జేయుట కృత్రిమ ముగ్ధత్వమా ? మఱియు , కృష్ణుఁడు అనామ ధేయు Cడు గా (డు. దనుజ శత్రువు ! అట్లగుట న తనియు నతని యింటివారియు సంగతులు గడు రహస్యములుగానుండునా ? అందును ముఖ్యముగా విరోధుల యిండ్లలో ! అందును ఇంద్రునిపై దండెత్తి గెల్చిన వజ్రనాభుని పురిలోను, గృహములోను ! వజ్రనాభుని పురింజొచ్చు నుపాయమునకు సూచక ముగ నుంటయ భద్రుని చరిత్రము యొక్క ముఖ్యోద్దేశము. ఉపా యాంతరము లున్నయెడల నీచరిత్రంబు వ్యర్ధంబగును. క్రా న నితరములగు వెరవులు సాధ్యములని కవి కనఁబ అచియుండుట గొప్ప పొరబాటు. కథ యొక్క కూర్పు బిగి తప్పిన దనుటకుఁ దార్కాణములు.

“తే, అప్పడు ప్రభావతికి నొక్కయతివ విరులు
గొనుచుఁ బోవంగ నందు నింపునఁ జరించు
 తేఁటిగమిలోనఁ దానొక్క తేఁటియగుచు
 నేగె మాయామనుండు రతీశ్వరుండు.”

(ప్రభా. ఆ. 4, 127)

తేటియైనవాఁడు హంస యేల కాఁ గూడదు ! ఆ పురిఁ బ్ర వే శము హంసలకు సుగమము. అవి వాలాయముం బోవుచు వచ్చు చుండునవి.