పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కవిత్వ తత్త్వ నిరూపణము

7


లేవు. మానవసంఘము రానురాను నాగరకత నొందుకొలఁది. ఆ యాటపాటలు నియమబద్దములు గావింపఁడినవి.

నాట్యము, గానము, కవిత్వము, ఆద్యకళలు. ఇతర కళలు పరికర సాధ్యములు గావున తదనంతరము పుట్టినవి. అన్ని జాతులవారి యాద్యకవిత్వమును బరిశీలించినయెడల సామాన్యముగ నది గేయరూపముగ నుండును. వేదములు గూడ నొకవిధమైన గేయములె. వానిని ఉదాత్తానుదాత్తాదిస్వరములతోఁ జదువకుండిన శ్రుతిహితములుగ నుండవు. ముఖ్యముగ సామవేదమును సామగానమని చెప్పుటయుఁ గలదు. రామాయణముగూడ గేయకావ్యమె, దానిని కుశలవులు గానము చేసినట్లు రామాయణమందు మనము చదువుచున్నాము. నేఁటికిని, అక్షరములు లేని "కొడగు" మున్నగు అనాగరక భాషలుగలవు. వానియందు, కవిత్వము గేయ రూపమునఁ బ్రచారములో నున్నది. అనాగరక జాతుల యందు గేయప్రతిభ మిక్కుటముగ నుండును. వారియం దొక్కఁడొక్కడును కవియె! ఒక్కఁడొక్కఁడును నటకుడె! ఈ విషయమును, మనము ప్రత్యక్షముగఁ జూచుచున్నాము. ఏనాది, యెఱుకల, జోగుల, మాలమాదిగజాతులవా రొకసారి యొక క్రొత్తపాటనుగాని వర్ణ మెట్టునుగాని వినుట. తటస్థించెనేని, మఱునాఁడె అట్టివియెన్నియో వారు రచించి పాడుచుందురు. హృదయము నాకర్షించు నేవిషయమును గుఱించియైనఁ గ్రొక్తక్రొత్త ఛందస్సులలో, అకృత్రిమముగ వారు పాటలల్లి పాడుచుందురు. కోటప్పకొండ మీద పోలీసువారికిని, అచ్చట మ్రొక్కుఁబడి.