పుట:Kavijeevithamulu.pdf/610

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

604

కవి జీవితములు.


కిన నామాటకుఁ దప్పినట్లు దలంచెద. అనుడు పోతన శ్రీనాథునినిర్బంధ వాక్యముల కేమియుఁ బ్రతివచనం బీయ నోరాడకుండుటం జేసి యూరకుండే. దాని నంగీకారపిశునంబుగ భావించి శ్రీనాథుండు కర్ణాటమహీజాని కడ కరిగి పోతనవృత్తాంతంబంతయుఁ దెలిపి భాగవతంబునకుఁ. గృతిపతివి గా నీవ తగు దని తెల్పి పోతనకవనంబు గొనియాడి యాతని పదలాలిత్యంబు నిన్నును నీపదలాలిత్యం బాతని సంతుష్టులఁ జేయు నని తలంచెద ననియె. రాజును శ్రీనాథుపలుకులకు సంతసిల్లి వల్లె యనియె.

పోతనచింత.

అంతఁ బోతన శ్రీనాథుపల్కులు మనంబునం దలపోసి యిట్లు చింతించె. అయ్యయో యిది యేటివృత్తాతంబు ! కర్ణాటునకుం గృతియొసఁగు మని న న్ని తండు బ్రేరేపించెడిని. నే నెటు జేసిన నీతని కేమాయె. నీతం డీవృత్తాంత మంతయు గర్ణాటమహీధపునకుఁ దెల్పియుండనోపు. అతఁడు కృతిఁ దెమ్మన్న నే నెట్లు దెత్తు. అటు గాకున్న నేమి చేటు వాటిలునో బుద్దిజూడ్యంబునం జేసి స్వాభిప్రాయంబు తేటపడం బల్కనైతి. ఇట్టిబుద్ధి మాంద్యము గలవానికిఁ జెట్టలు తప్పక రావలయు. అని తన్ను నిందించి కొనుచు నేమియుఁ జేయఁ జేయాడకున్న నొకచోఁ గూర్చుండియుండి కనులుమూసె. అంతఁ గమలపాణి యగువాణి కన్నీరు వఱదలై పాఱ నేడ్చుచుఁగాన్పించె. పోతన యాపె కమలభవునిరాణిగ నెఱింగి రోదనము సేయుటకుఁ గతం బూహించి స్వాపరాధంబ దానికిం గారణం బని యెంచి యద్దేవిం గాంచి యిట్లనియె:-

"ఉ. కాటుకకంటినీరు చనుకట్టుపయిం బడ నేల యేడ్చెదో
      కైటభదైత్యమర్దనుని గాదిలికోడల యోమదంబ యో
      హాటకగర్భురాణి నిను నాఁకటికిం గొనిపోయి యల్లక
      ర్ణాట కిరాట కీచకుల కమ్మఁ ద్రిశుద్ధిగ నమ్ము భారతీ.”

అని పల్కి యాపె నూరార్చి నాఁటనుండియుఁ గర్ణాటునకుం గృతినిచ్చుతలంపు మానియుండెసఁట. ఇట నొక్కనాఁడు కర్ణాటమహీ