పుట:Kavijeevithamulu.pdf/474

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

468

కవి జీవితములు.

చిన తిక్కన నారసింహకవులు అంతకంటెను మెఱుఁగులు తెచ్చి రనియు నట్టిసంగతి ప్రకాశముగఁ జెప్పినచోఁ బరనింద కాకున్న నలౌక్యమనియు నెంచి మఱియొకచమత్క్రియామార్గమున తమతమ సామర్థ్యంబులు వెల్లడించిరనియుఁ జెప్ప నొప్పియుండును. ఆపద్యము లెట్లున్న వన :-

"గీ. కావ్య మత్యాద్య మైన సత్కావ్య మింక,నుక్తకావ్యంబయేఁ బునరుక్తి దెచ్చుఁ
     గాన కవితాభిముఖుఁ డైనఁ గవివరునకు, మిశ్రకావ్యంబె కావ్యమై మెచ్చుఁ దెచ్చు.

క. నేరిచినసుకవి కృతిచే, బే రెఱిఁగించికొని జగతిఁ బెం పగు టొప్పున్
    నేరక కృతి చెప్పుట తగ, నేరమి యపకీర్తి జగతి నిలుపుట గాదే.

క. ఏరసము చెప్పఁబూనిన, నారస మాలించువాని నలరించని యా
    నీరసపు కావ్యశవముల, దూరముననఁ బరిహరింపుదురు నీతిజ్ఞుల్.

చ. ఫణుతుల రెంట మూఁట నొకపద్యముఁ గూరుచువారు లక్ష్యల
    క్షణసహకావ్యనిర్వహతఁ గల్గుట చిత్రముగాని యట్లపో
    ఫణమణిమాత్రధారు లగుపాము లసంఖ్యము గాక తత్ఫణా
    మణివిధవిశ్వభూభృతిసమర్థుఁడు శేషుఁడు గాక కల్గునే,

క. ఆకుల నిడియెడుకవితా, పాకంబులు మొదలు చెడినప్రాఁతప్పుల నా
    లోకము జిహ్వాంచలములె, యాకులుగా నుండు నెవ్వి యవియొకొ కవితల్.

క. పరభుక్తము లైనయలం,కరణముల జుగుప్స, లేక గైకొని పదవి
    స్ఫురణంబు చూపుకుకవితఁ, బరికింపఁగ లజ్జ లేనిబానిస గాదే.

క. కలకంఠ కలన చూపక, కలకంఠం బూరకున్నఁ గాకమ కాదే
    కవిత నిజవాగ్విలాసం, బలరింపనితజ్ఞుఁడైన నజ్ఞుఁడు కాఁడే.

చ. ఖలుఁ డిల దప్పులే వెదకుఁ గావ్యరసానుభవంబుఁ జేయలేఁ
    డొలుకులు గోరు గాక ముద మూనఁగ గర్దభ మొంద వేర్చునే
    మలయమరుద్విధూతమధుమాసవికస్వరకేసరావలీ
    కలితపరాగయోగపరికల్పిత పేశలతల్ప సౌఖ్యమున్.

క. ఎల్లరు మెచ్చని మత్కృతి, నుల్లంబున మెచ్చుఁగాత యొకఁ డుష్ట్రకులం
    బొల్లనిపల్లవితామ్రముఁ, గొల్లలుగాఁ బొగడ నొక్క కోయిల లేదే.

గీ. తప్పుగల్గెనేని తారె తెల్పి రసజ్ఞు, లస్మదీయకవిత ననుమతింతు
    రించు కలుక గలిగెనేఁ దేర్చి ప్రేయసి, నుల్లమున వరింప కోర్తు రెట్లు."

పైపద్యముల వివరించితిని గావున నిఁక వానిలోని సందర్భము నాలోచింపవలయును. దీనిలోఁ గవిత్వము చెప్పఁ బూనినవాఁడు