48
కవిజనాశ్రయము.
[1]లాటీవిటవృత్తము .-
సససామతయంబులు సూర్యయతిశ్రవ్యంబై లాటీవిటవృత్తం
బసమానయశా! నుతమానగుణా ! యాశ్చర్యాన్వీతంబగుధాత్రిన్. 108
వనమంజరీవృత్తము. -
నయుతజకారచతుష్కభ రేఫగణత్రయోదశవిశ్రమా
శ్రయమగు నప్వనమంజరి రేచన ! సర్వశాస్త్రవిశారదా ! 109
మణిమాలావృత్తము .-
కదియంగమూఁడుసజముల్ స కారయుతమైదిశాఖ్యయతిగా
మదనాను కారి ! నిఖిలాగమజ్ఞ ! మణిమాలయుండ్రుసుకవుల్. 110
[2]కరిబృంహితవృత్తము. -
మూఁడుభనములుగూడి రగణముముట్టికొనఁగరిబృంహితం
బాడువనము నిజార్థమునఁ గలయం ద్రిదశయతి నర్కులన్ . 111
వ. [3]ఆకృతిచ్ఛందంబున కిరువదిరెం డక్షరంబులు పాదంబుగా 4194304 వృత్తంబులు పుట్టె. అందు,
మహాస్రగ్ధరావృత్తము. -
లసదుద్యత్కీర్తివల్లీ లలితగుణగణాలంకృతాంగా! సతాన
స్థనరాగంబుల్ మహాస్రగ్ధరకువసుమునిస్థానవిశ్రాంతినొప్పున్. 112
[4]సుభద్రకవృత్తము. -
మందరభృత్సమాన! నిఖిలాగమజ్ఞ ! వెలయంగరుద్రయతితో
నందముగాభ సంయుతరనత్రయాగ్రగురువై సుభద్రకమగున్. 113