పుట:Kathalu Gadhalu - Vol3 - Chellapilla Venkata Sastry.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ మ త్పర దే వ తా యై న మః

వ క్త వ్యాంశ ము

సుమారు ఒకదశాబ్దిపాటు ఎడతెగని దీక్షతో సుప్రసిద్ధములైన ఆంధ్ర - దైనిక - వార – పక్ష - మాస - పత్రికల్లో ప్రచురితములైనట్టిన్నీ కొన్ని అముద్రిత స్వరూపంలోనే ఉన్నట్టిన్నీ వ్యాసములు - కథలు- గాథలు తృతీయ భాగము ముదించడంతో స శేష స్వరూపాన్నివీడి అశేష స్వరూపం దాల్చినట్లుగానే పాఠక లోకం భావించుకోవచ్చును. గాని మూకు మాతం కొంచెం వక్త వ్యాంశం మిగిలియున్నది.

ఈ తృతీయభాగంలో గూడా కొన్ని అసంపూర్ణ వ్యాసావళి ముద్రించక తప్పలేదు. వాట్లకు సంబంధించిన సూచనలు ఇక్కడ విస్తరించడం అనావశ్యంకాదు సరికదా ? భావి పరిశీలకులకున్ను సదరు పరిశీలకులకు తోడ్పడే సారస్వతాభిమానులకున్ను చాలా అవసరంకూడా కనుక పై అసంపూర్ణ వ్యాసావళికి సంబంధించిన సూచనలు ఉటంకరిస్తాను.

(1) 326 వ పేజీలో ఆరంభింపబడిన రాణాప్రతాపసింహచరిత్ర శీర్షిరలో చుక్కలుంచబడిన భాగంలో కొంతవ్యాసభాగం సంపాదింపవలసిఉంది.

(2) 835 వ పేజీలో ప్రారంభించిన అభ్యనుజ్ఞ అనే వ్యాసంలో మిగిలి పోయిన భాగం యేమీ లేదుగాని త్రియంబక శబ్దవిచారము • ఆ నే వ్యాసం వొకటి పైవ్యాసానికి ముందుగా ప్రకటింపఁ బడవలసినది ఉంది. యీ వ్యాసం శ్రీ నాళం కృష్ణారావుగారి షష్టిపూ_ర్తి సంచికలో పచురింపబడ్డది. ఆసంచిక నేను సంపాదింపలేక పోయినందున ఆవ్యాసం యిక్కడ ప్రకటించడం కుదరలేదు.

(3) 896 వ పేజీలో " వింతశ్లేషలు " అనేవ్యాసం ఆంధ్రవాణీ పత్రిక లో ప్రకటింపఁబడ్డది. ఆరంభింపబడుటలో పూర్వం కొంత వ్యాసం లభింపబడనిది ఉన్నట్టు తెలుస్తూన్నా అక్కడ చుక్కల గుర్తుంచకుండానే