పుట:Kanyashulkamu020647mbp.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రామ: గవురనుమెంటు జీతమిచ్చుంచిన కనిష్టీబులుండగా మనకెందుకు శరీరాయాసం? యీ వెధవని పఙ్యండు కోర్ట్లంటా తిప్పక పోతే నేను రామప్పంతుల్ని కాను చూడు నా తమాషా!

మధుర: ( రామప్పంతుల్ని ముద్దుబెట్టుకుని ) మాటాడక వూరుకొండి. ( మంచం కింది వేపు చూపించి నోరు మూసి ) దొంగ దెబ్బ కొట్టిన వాడిదే అవమానం మీది కాదు.

రామ: నొప్పెవడిదనుకున్నావు? ఆ ముండ మంచం కిందనించి రాదేం? చీపురుకట్ట లాక్కో.

పూట: ఫడేల్మంటే పస్తాయించి చూస్తున్నాను. నీ మొగతనం యేడిసినట్టేవుంది. (పైకి వచ్చును)

(అంతా నిష్క్రమింతురు)

---*---