పుట:Kadapa Oorla Perlu.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

౨౦

గ్రంథం లో సగోత్ర రూపాలను దాదాపు అన్ని వూర్ల పేర్ల పదాల వివరణకు ఇవ్వడమైనది. ముఖ్యం గా సగోత్ర రూపాల అవసరాన్ని అలిమెల, పొడదుర్తి, హనుమన గుత్తి, వంటి వూర్ల పేర్లను వ్యుత్పత్తి నిరూపణ లో చూడవచ్చు.

5. వ్యుత్పత్తి నిర్ణయం లో ఆయా వూర్లకు సంబందించిన నైసర్గిక పరిఙౌౣనం కూడా అవసరమౌతుంది. సర్వే మ్యాపుల వల్ల ఒక వూరి భౌగోళిక పరిసరాలు తెలుస్థాయి. ఒక ఊరు ఏటిగట్టున వుందో , కొండ ప్రక్కన ఉందో , అడవి మధ్య వుందో మొదలైన పరిసరాల వివరాలు వూర్ల పేర్ల పుట్టుకను నిరూపించేందుకు తోడ్పడతాయి. ఉదాహరణకు వెలుదుర్తి , పొడదుర్తి,పోట్లదుర్తి, హనుమన గుత్తి, గ్రామాల్లోని తుర్తి అనే మాటకు కొండవాగు అని అర్ధం. ఈ వూర్లన్నీ నది గట్టునే ఉండడం అర్ధ నిర్ణయానికి సాయపడుతుంది. కోడూరు లోని కోడు అనే పదానికి కొండాకొన, ఊరిదరి నీటిపల్లము అనే అర్ధాలున్నాయి. సరైన అర్ధం నిరూపించడాని కి అవి ఉన్న నైసర్గిక పరిసరాలు పరిశీలించడమే.కోడూరు అనే పేరుగల ఊర్లన్నీ వాగులప్రక్క వూర్లే.(చూడండి పు.246- ఆరో. 945 నుండి 948) గ్రామాలకు ఆకారాది నిఘంటువు. గ్రామ నామాలు, ప్రధానారోపాలు అవి సంఖ్యాక్రమ పూర్వకాలు.


6. నిఘంటువులో అస్పష్ట నామబంధాలుగా పేర్కొనబడిన దాదాపు 90 వూర్ల పేర్ల వ్యుత్పత్తులను ఊహించడం సాహసమే కాక, శాస్త్రీయం కాదు. కాబట్టి అటువంటి వాటిని వివరించలేదు. ముఖ్యం గా - అం.; ఏల; ఊట్ల, ద్వితీయావయంగాకలిగిన మర్ల్ల్ల్లేల, దుద్యాల, కల్వటాం, పైడేల, కల్లుట్ల , వంటి వూర్ల పేర్లకు చారిత్రిక రూపాలు తగినన్ని లభించకపోవడమే , సగోత్ర రూపాల మృగ్యం కావడమే వాటిని అస్పష్టం గా పేర్కొన డానికి కార

నిఘంటు నిర్మాణ విధానం:

1. ఇది కడప జిల్లాలోని 8403 గ్రామాలకు ఆకారపు నిఘంటువు. గ్రామ నామాలు ప్రధానారోపాలు. అవి సంఖ్యాక్రమ పూర్వకాలం.

2. గ్రామ నాం ద్వితీయావయలైన , అగ్రహారం, అబాదు, ; - ఊరు; - పల్లె మొదలైనవాటిని ప్రధానారోపాలనుంచి ప్రత్యేకించి నిఘంటువు లో అనుబంధ భాగం గా ఆకారాది క్రమం లో 1 నుండి 89వరకు సంఖ్యాక్రమ పూర్వకంగా కూర్చడమైనది..