పుట:Kadapa Oorla Perlu.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

౧౭

తెలుగు నిఘంటు రచనా ఫ్రణాళిక లో ఊర్ల పేర్ల విలువను గుర్తించడం వల్ల నే కీ. శే.,వేదం వేంకట రాయ శాస్త్రి వంటి సాహిత్య వేత్త కూడా " గ్రామా నామములను వివరించిన వాడే సర్వజౢుడు " అని అన్నారు.(ఆంధ్ర భాషాసర్వస్వ నియమకతి పయములు,1948, పు.2) సర్వజౢుడయినా, కాకపోయినా భాషావిజౢానం. , భూగోళ విజౢానం , పురాతత్వ విజౢానం ,జానపద విజౢానం , చరిత్ర వంటి వివిధ సామాజిక శాస్త్రాలలో అంతో ఇంతో పరిచయం ఉన్న నాడు తప్ప ఊర్ల పేర్లను వివరించ లేడు.

పాశ్చాత్య దేశాలలో ఊర్ల పేర్లను సేకరణ వివరణే కాదు,మొత్తం సేకరణా, వివరణా బహుముఖం గా సాగుతున్నాయి. నామ వ్యాకరణాలు, నామ వ్యుత్పత్తి నిఘంటువులూ వెలువడు తున్నాయి. ప్రాచీన చరిత్ర పునర్నిర్మాణం జరుగుతోంది. అయితే ఇంతవరకు ఏ భారతీయ భాషల్లో కూడా నామవ్యాకరణాలు కానీ,వ్యుత్పత్తి నిఘంటువులు కానీ వెలువడ లేదు.

భారత దేశం లో ఇంతవరకూ ప్రత్యేకంగా స్థల నామాలపై వచ్చిన సిద్దాంత వ్యాసాలు రెండు మూడుకు మించి లేవు. శబ్ద పరిశీలనకు అర్ధ పరిశీలనకు సమ ప్రాధాన్యం ఇచ్చి , సామాజిక సాంస్కృతిక పరిశీలనకు సముచిత ప్రాధాన్యాన్ని ఇచ్చిన సిధ్ధాంత వ్యాసాలు కావు అవి. వ్యాకరణ భాగానికీ, వ్యుత్పత్తి నిఘంటు భాగానికీ సమన్వయ పథకం రూపొందించినవి కావు అవి. విశిష్టమూ, ప్రాచీనమూఅయిన మన చరిత్రను ప్రతిబింబించే ఊర్ల పేర్ల పరిశోధనలో, ఊర్ల పేర నిష్పత్తీ, , వ్యుత్పత్తీ ప్రధాన మైనవి. అందుకే ప్రధమ ప్రయత్నంగా ఇటువంటి రచనా ప్రణాళిక రూపొందించ బడినది. భారతీయ భాషల్లోనే ఈ ప్రణాళిక సమగ్రం కాక పోయినా, అపూర్వమైన దనుకొంటాను.

గ్రంధ రచనా ప్రణాళిక:

ఈ గ్రంధం లో రెండుభాగాలున్నాయి. మొదటి భాగం కడపజిల్లా ఊర్ల పేర్లకు సంబంధించిన వర్ణనాత్మక వ్యాకరణం. రెండవ భాగం వ్యుత్పత్తి పరిశీలననాత్మకమైన ఊర్ల పేర్ల నిఘంటువు.

మొదటి భాగం : కడప జిల్లా గ్రామ వర్ణనాత్మక వ్యాకరణం.

ఈ భాగం లో 9 అధ్యాయాలున్నాయి. మొదటి మూడు అధ్యాయలైన గ్రామ నామ పరిశీలన - పరిమితి ప్రయోజనాలు, 2. సంజౢాానామ తత్వ సమస్య-