పుట:Kadapa Oorla Perlu.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏంతయినా ఉంది. ఎంతొ ప్రాచీనత కలిగిన ఈ జిల్లాల చరిత్రను ప్రామాణికంగా, పునర్నిరించడం, సమగ్రాంధ్ర చరిత్ర రచనకు దోహదం అవుతుంది.

ఎన్నొ వ్యయప్రయాసల కోర్చి కడప జిల్లాలోని ఊర్లపేర్లను వాటి శాసన రూపాలను సేకరించి , వాటిని నిశితంగా పరిశీలించి సిద్దాంత వ్యాసాన్ని రచించి , శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి డాక్టరేటు పట్టాన్ని పొందిన డా. కేతురెడ్డి విశ్వనాధ రెడ్డి అభినందనీయుడు. అతడిదివరకే చక్కని కధానికా రచయిత గా ఆంధ్ర పాఠకులకు సుపరిచితుడు. ఇటువంటి వివిధ వైజ్ఞానిక రంగాలలో కృషి చేసి మన సామాజిక సాంస్కృతిక పరిశీలనకు , వికాసానికి దోహదం చేయవలసిన గొప్ప కర్తవ్యం శ్రీ విశ్వనాధ రెడ్డి భాషా, సాహిత్యకారుల మీద ఎంతైనావుంది.

కడప జిల్లా సామాజిక సాంస్కృతిక వికాసానికి తోడ్పడే రచనల ప్రచురణ ప్రకాశం శతజయంత్సువ సమితి ఉద్దేశ్యాలలో ఒకటి.

ఈ ఉద్దేశ్యంతో వివిధ ఉపయుక్త గ్రంధాల ప్రచురణకు సమితి నిధుల నుండి ఋణ సహాయం చేసే పథకం రూపొందించ బడినది. ఈ గ్రంథ ప్రచురణకు రు.5000/-లను మొట్టమొదటి సారిగా మంజూరు చేయడమయినది. ఈ పథకం క్రింద అప్పుడే రెండు పుస్తకాలు వెలువడినాయి. ఇది మూడవది. విశిష్టమైన ఈ పరిశోధక గ్రంధాన్ని సహృదయ పాఠకులు ఆదరించి ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.


కడప

23-9-1976

పి. ఎల్. సంజీవ రెడ్డి ఐ.ఏ. ఎస్

జిల్లా కలెక్టరు, కడప