Jump to content

పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దేవకన్యలకథ.

247

గంధ — అవును. చంద్రకళ చెప్పినట్లు మధుమతిచేతనే మొదట నామాట పలికింపవలయును.

మధు - నాకోరికవిని యత్యాశాపరురాలని మీరు పరిహాసమాడుదురేమో యైనం జెప్పెద వినుండు.

శ్లో. మహాకులీనత్వముదారతాచ తథా మహాభాగ్యవిదగ్ధభావౌ
    తేజస్వితా ధార్మికతోజ్వలత్వ మమీగణాజాగ్రతి నాయకస్య.

గొప్పవంశమున జనింపవలయు లోకాతీత సౌందర్యశాలి కావలయుఁ గృత్యవస్తువులయందుఁ జాతుర్య ముండవలయుఁ ధర్మైకాయత్త చిత్తుండు, సర్వసర్వంసహైశ్వర్యయుక్తుండు జగత్ప్రకాశకుఁడు నగునట్టి వాని నాకు భర్తగాఁ జేయుమని నేనమ్మవారిం బ్రార్థించుచున్నాను.

గంధ — బాగు బాగు. ఇంకేమి? నీవు ధీరోదాత్తునే గోరితివి. నేనుమాత్రము సామాన్యునిఁ గోరుదునా? నాయభిలాష వినుము.

శ్లో. కీర్తిప్రతాపసంపన్నః పుమర్ధత్రయతత్పరః
    ధురంధరత్వగుణవాన్ నాయకః పరికీర్తితః.

మధుమతి కోరిన గుణములుండి కీర్తిప్రతాపములచే నొప్పుచుఁ బురుషార్ధములయం దిష్టము గలిగి ధురంధరుండై యొప్పువాని నాకు నాయకునిగాఁ జేయుమని యమ్మవారిం బ్రార్ధించుచున్నాను.

మ - ధీరోద్ధతుం గోరితివి. నీయభిలాషమాత్రము తక్కువగా నున్నదియా! కానిమ్ము, వారుణీ! నీయభిలాషఁగూడ వివరింపుము.

వా - మీయిరువురు గోరిన పురుషునిగుణములన్నియుఁ గలిగిన ధీరలలితుం బతిగాఁ జేయుమని గాయత్రీదేవిం గోరుచున్నాను.

మ - బలే బాగు. మంచికోరిక కోరితివి.

శ్లో. సధీరలలితో నేతా నిశ్చింతో భోగలంపటః.

అనుటచే నతండు భోగలంపటుఁడై యుండుగావున వారుణి నొడిలోఁ బెట్టుకొని కూర్చుండఁగలఁదు. చంద్రకళా ! నీమనోరథము గూడ