పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సుధన్వునికథ.

101

ఘృణీలసత్కవాటఘటితంబై యొప్పుచు నేత్రపర్వముగావించినది. తదభ్యంతరప్రదేశము,

సీ. లలితపల్లవపుష్ప ఫలవల్లరీభార
             నతమహీరుహ లతాన్వితవనంబు
    వనవిరాజిత సరోవరజలాంతర చర
             త్పతగసన్నాద మోదితజనంబు
    జనవిహారోపయోగ నవీన సికతా వి
             లసితవాపీ తటాకసురుచరము
    చిరపుణ్యలాభ సంసేవనీయ విచిత్ర
            మణి లసత్ప్రాసాద మంటపంబు

గీ. మంటపాశ్రిత దేవతా మానినీ ప్ర
    గీతసంగీత నాదసంప్రీత గగన
    చరదమర యుగ్మ మధిక తేజఃప్రకాశ
    దీపితంబగు తన్మధ్య దేశమరసె.

కనకమణిమయ శిఖరంబులఁ బ్రకాశింపుచున్న యన్నగమధ్యదేశం బతివిశాలంబై సమచతురంబై శృంగారకేళీవన తటాకాభిరామంబై భర్మమణిహర్మ్య శ్రేణీవిరాజమానంబై కన్నులకు మిఱుమిట్లు గొలుపుచున్నది. తత్ప్రదేశం బరయుచు లోనికి నాలుగడుగులు పెట్టినతోడనే యాద్వారంబు ఎప్పటియట్లు పాషాణాచ్ఛాదితంబైనంత నివ్వింతనరయుచున్న నతండు దూరమందుఁగనంబడు చున్న విచిత్ర సౌధంబుల చెంతకరుగఁ దెరువరయుచుండ నింద్రజాలపింఛికచేఁ దుడువఁబడిన వాఁడుఁ బోలె విభ్రాంతిఁజెంది కర్తవ్య మెఱుఁగక చూచుచున్నంతలో ననంతమణికాంతి సంతానంబులు దిగంతంబుల వ్యాపింప గాంచనరత్న ప్రదీప్తంబగు పల్లకీనూని మానిఁనీ సహస్రంబులు దివ్యాలంకారశోభిత గాత్రలై వేత్రంబులంగరంబులఁ బూని కొందరు వెనుక