పుట:Jyothishya shastramu.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఏర్పడును. కేంద్రము ఒక భాగములో ఎప్పటికైనా ఒకే స్థానములో ఉండును. మూడుగాయుంటే అది ఎప్పటి కైనా ఒకదానికొకటి కోణమే అగునుగానీ, ఎప్పటికీ కేంద్రము కాదు. ఉదాహరణకు కర్మచక్రములో కోణములు ఎలాగున్నవో 39వ చిత్రపటములో చూస్తాము.

39వ చిత్రపటము

మూడు స్థానములు ఎప్పటికైనా కోణాకారమగునని స్పష్టముగా తెలియుచున్నది. నాలుగు స్థానములు చతురస్రాకారమగును, ఒక్క స్థానమును కేంద్రము అనవచ్చును. కర్మచక్రములోని అంగీ, అర్ధాంగి అను రెండు భాగములలో ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి కేంద్రముగాయుండుట వలన, రెండు భాగములలో 4వ స్థానము ఒక ప్రక్క, 10వ స్థానము ఒక ప్రక్క కేంద్రములుగా ఉన్నవి. ఈ విధముగా కర్మచక్రము పన్నెండు భాగములు రెండు భాగములుగా విభజింపబడియుండగా, రెండు భాగములకు రెండు కేంద్రములువుండును. కొందరు కేంద్రములు మూడు అని కొందరు నాలుగుయని చెప్పడము శాస్త్రమునకు విరుద్ధమగును.