పుట:Jyothishya shastramu.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రెండు వర్గములుగా విభజించబడిన గ్రహములు, ఒక వర్గమునకు మరొక వర్గము శత్రువులుగా ఉన్నవని చెప్పుకొన్నాము. మిత్రులుగానున్న గ్రహములను శుభులని అంటున్నాము. అంతేకాక మిత్రగ్రహములు పుణ్యమును పాలించునవి కావున, వాటిని పుణ్యులు అని అంటున్నాము. వారు పుణ్యులు కావున శుభులని చెప్పడము జరిగినది. అదే విధముగా శత్రు గ్రహములు మానవుని పాపమును పాలించునవి కావున, ఆ జీవునికి అవి పాపులనీ మరియు అశుభులనీ అనడము జరుగుచున్నది. రెండు వర్గములకు గురువర్గము, శనివర్గము అని నామకరణము చేయడము జరిగినది. రెండు వర్గములవారు ఒకరికొకరు శత్రువులైనా, పుట్టిన జీవునికి ఒక వర్గము మిత్రులు, ఒక వర్గము శత్రువులుగా వ్యవహరించుచున్నవి.

18. వృశ్చికము

ఇపుడు వృశ్ఛికలగ్నమునకు ఎవరు మిత్రులో ఎవరు శత్రువులో తర్వాత పేజీలోనున్న 20వ పటములో చూచెదము.

వృశ్ఛికలగ్నమునకు అదే లగ్నాధిపతియైన భూమి, ప్రక్కనేయున్న ధనుర్ లగ్నాధిపతియైన కేతువు మరియు మీన లగ్నాధిపతియైన గురువు, మేష లగ్నాధిపతియైన కుజుడు, కర్కాటక లగ్నాధిపతియైన చంద్రుడు, సింహ లగ్నాధిపతియైన సూర్యుడు మొత్తము ఆరు గ్రహములు మిత్ర