పుట:Jyothishya shastramu.pdf/306

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎంతో వ్యయప్రయాసలతో ఆకాశములోనికి ఉపగ్రహమను రాకెట్‌ పంపి, కుజగ్రహము ఎర్రగ ఉన్నదని, ఇప్పుడిప్పుడు ఖగోళశాస్త్రజ్ఞులు చెప్పు చున్నారు. కుజగ్రహము ఎర్రగ ఉన్నదని కొన్ని లక్షల సంవత్సరముల పూర్వమే మన మహర్షులు చెప్పారు. ఏ శాస్త్రమూ అభివృద్ధికాని ఆ కాలములోనే, వారు చంద్రుడు తెల్లని చౌడు భూమియని కూడ చెప్పారు. వారు ఆ రోజులలో వారి ప్రక్క వానిని గుర్తించి, వాడు చెప్పినట్లు చెప్పారు తప్ప, వారు చంద్రుని మీదికి, కుజుని మీదికి పోయి చూడలేదు. అలాగే వారు చెప్పిన పద్ధతి ఏదో, దాని ప్రకారము నా శరీరములో, నా ప్రక్కనేయున్న వాని సహకారముతోనే, నేడు నేను గ్రహములు తొమ్మిది కాదు మొత్తము పండ్రెండని చెప్పుచున్నాను. అర్థమైందా, ఇంకా ఏమైనా అనుమానముందా? ప్రక్కవాడు మీలో కూడా ఉన్నాడు, కానీ మీలో మీరు తప్ప ఎవరూలేరను గ్రుడ్డితనములో ఉన్నారు. కావున ప్రక్కవానిని విస్మరించిపోయారు. వానిని తెలియాలంటే ‘జ్ఞానాంజనము’ అను కాటుక కావాలి. కాటుకతోనే గ్రుడ్డితనము పోయి అతడు కనిపిస్తాడు. జ్ఞానాంజనము కావాలంటే ఎటు తిరిగీ షట్‌శాస్త్రములలో చివరి ఆరవ శాస్త్రమైన బ్రహ్మవిద్యాశాస్త్రమును తెలిసి తీరాలి. అదెక్కడుండేది మాకు తెలియదే అనుకోవద్దండి. అదియే భగవద్గీత. సూటిగా చెప్పాలంటే అదే ‘‘త్రైతసిద్ధాంత భగవద్గీత’’. దానిని చదివితే మీలోనే మీ ప్రక్కనేయున్న వాడు తెలియును. వానిని తెలుసుకొంటే వాని ద్వార ఏ రహస్యమైనా తెలుసుకోవచ్చును.

14) ఒక వ్యక్తి వ్యవసాయము కొరకు బావి త్రవ్వితే నీరు రాలేదు. బోరువేస్తే నీళ్ళు పడినాయికానీ బోరు పూడిపోతున్నది దానివలన నీళ్ళు రాలేదు. రెండుచోట్ల బోరువేసినా అట్లే అయినది. అతనికి నీరు అనుకూలము లేదా?