పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జర్శను వలసరాజ్యములు కలిసి ఏక సామ్రాజ్యముగా ఉండడమునకు మార్గ మేర్పడినది. ఆర్థిక పరిస్థితు లనుబట్టి ఈసామ్రాజ్యములో ఆస్ట్రియా మొట్ట మొదట చేరుతుంది. జెకో-స్లోవేకియాలోను, పో లాండులోను ఉన్న జర్మనులు తండ్రి రాజ్యము మీద ఎక్కువ అభిమానము కలిగి ఉన్నారు. తా మిప్పుడు అస్వాభావికముగా ఉన్న దేశముమీద వారికంత ఇష్టము లేదు. అచ్చటచ్చటవిడబడి జర్మ నులున్న దేశములను ఆకర్షించేశక్తి జర్మను రా జ్యాంగ పద్ధతికి ఉన్నది. బ్రిటిషు సామ్రాజ్యములో అట్లుకాదు; దీన్ని ఒక్క బ్రిటిషు దీవుల చేయి పై గా ఉన్న ది. జర్మనీకివ లె బ్రిటిషు సామ్రాజ్యమునకు ఒక రాజ్యాంగ పద్ధతి లేదు. దీని వలసరాజ్య ములుతల్లి నుండి విడిపోయి తమసంసారములను చూ చుకొనే ఉద్దేశముతో ఉన్న విగాని, వాటికితల్లి యింటిలో పడి ఉండవలెనని లేదు. తల్లి కిన్ని తమ కున్ను సామాన్య లక్షణము లేదు.


యుద్ధమయిన తరుహత జర్మనీవారు తమ విద్యాపద్ధతిని, రాజ్యాంగ పద్ధతిని బాగుగా గాలించి


200