Jump to content

పుట:JanapadaGayyaalu.djvu/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గూడూరు చిన్నదాన

హరికాంభోజి స్వరాలు - ఆదితాళం

గూడూరు చిన్నదాన
గూడూరు గుట్టాలదాన
గూడూరు గుట్టాలమీద
గాజులుంటె సోకే
          ఓ చిన్నదానా
          ఓ చిన్నదానా ||

నీలి నీలాటిదాన
నిలువు సన్నాటిదాన
నీలి నీలాము మీద
నగలుంటె సోకే
          ఓ చిన్నదానా
          ఓ చిన్నదానా ||

సన్నా సన్నానిదాన
సన్నాని కురులదాన
సన్నాని కురులమీద
జాజి గుత్తి సోకే
          ఓ చిన్నదానా
          ఓ చిన్నదానా

(" గుంటూరూ చిన్నదాన గుళ్ళాపేరులదాన " పాటలాగ)