పుట:JanapadaGayyaalu.djvu/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

27

3. కాకినాడ సిన్నదాన
కాసుల్ కంటేలదాన
కాసుల్ కంటేల మీద
మనసేల లేదే || ఓ సిన్నదాన - - ||

4. అద్దారుపాయపెట్టి
అద్దాల రైక కొంటె
అద్దాల రైకమీద
బుద్దేలలేదే
ఓ చిన్నదానా
ఓ చిన్నదానా ||

5. నల్లానల్లానిదాన
నడుమూ సన్నానిదాన
తళుకూ సేపల మల్లె
కులుకూ సూపులదాన
నిన్ను సూసీ మనసు
నిలువకున్నదోలె
ఓ చిన్నదానా
ఓ చిన్నదానా ||

  (వల్లూరి జగన్నాధరావుగారి వద్ద సేకరించినది) కాకినాడ 1936