పుట:JanapadaGayyaalu.djvu/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2)
తాళ్ళరేవు వోడమీదా
సిరి సిరి మువ్వా - బల్
తళుకు సీరలంపినానే
సిరి సిరి మువ్వా
అందినట్టు తెలపవేమే
సిరి సిరి మువ్వా - నా
అందగత్తెనీవు గావ
సిరి సిరి మువ్వా

3)
అద్దాల మేడలోన
సిరి సిరి మువ్వా - నీతో
సుద్దులాడ నోచనైతి
సిరి సిరి మువ్వా
కాని కాల మౌటచేత
సిరి సిరి మువ్వా
కడకు నీకు దూరమైతి
సిరి సిరి మువ్వా ||

4)
చల్లని వెన్నెలనాడు
సిరి సిరి మువ్వా - వేయి
కళ్ళ నిన్ను చూడాల
సిరి సిరి మువ్వా
తెల్లని దేహమువాడు
సిరి సిరి మువ్వా
ఎల్లసిరుల నివ్వాలి
సిరి సిరి మువ్వా ||

సేకరణ - కాకినాడ
     1936