Jump to content

పుట:JanapadaGayyaalu.djvu/183

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గొంతెమ్మ పాట

శంకరాభరణం స్వరాలు - త్రిశ్రం

1)

స స స స స రి | రి గ గా మ గ స రి ||
ఒ యి బా వ ల్లా ర | తు మ్మె దా - = దా - ||
గ మ గ రీ రీ గ రి | స స సా " ||
న న్ని - లా లా - - | తు మ్మె దా " ||

2)

వీశ్వరుడు మానవుడు తుమ్మెదా
తోటల్లాలోకి తుమ్మెదా

3)

ఇరగమడి వచ్చింది తుమ్మెదా
దేవసిరినంది తుమ్మెదా

4)

గాంధారి పెంచినా తుమ్మెదా
గజ్జెళ్ళానంది తుమ్మెదా

5)

మాదేవి పెంచినా తుమ్మెదా
మడమల్లానంది తుమ్మెదా

6)

యీనినా వరిసేలు తుమ్మెదా
యీదిలాడా దొక్కింది తుమ్మెదా

7)

పండినా వరిసేలు తుమ్మెదా
పాయిలిడా తొక్కింది తుమ్మెదా

8)

అంతట్లొ ఆసేను తుమ్మెదా
కాపన్న వచ్చేడు తుమ్మెదా