పుట:JanapadaGayyaalu.djvu/163

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఒడినిండ పస్పేస్కో


28 వ మేళకర్త హరికాంభోజి స్వరాలు - ఆదితాళం

1)

ధ సా స ధ సా స | ధ సా రి గా మ గ ||
ఒడి నిండ స స్పే సొ | వ య్యా ర మే మె - ||


రి రి గ రి స స సా | రి రి గ రి స స సా ||
గు నా సా రి గు న్న మ్మా | గు నా సా రి గు న్న మ్మా ||

2)

పొద్దున్న నువ్వులెగసి పొలానికెళ్లే
గునాసారి గున్నమ్మా

3)

ఎండెక్కి సూరీడు కొండెక్కి సూసే
గునాసారి |గున్నమ్మా|

4)

గంపాకిందా కోడి కయ్యిమని లేచె
గునాసారి |గున్నమ్మా|

5)

గొప్పు తవ్వేకాడ కొప్పెందుకోలె
గునాసారి |గున్నమ్మా|

6)

గట్టెక్కి సూత్తాడొ గవరయ్య కాపు
గునాసారి |గున్నమ్మా|

7)

మద్దేనం యాలపుడు మరిదప్పి కెత్తె
గునాసారి |గున్నమ్మా|

8)

సల్దిగెంజి కాత తాగీమరి ఉ డూ
గునాసారి |గున్నమ్మా|