పుట:JanapadaGayyaalu.djvu/161

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4)

పారిపోయిన బావ "
పరుగెత్తుక రావాలి "

5)

ఊరి కెళ్లిన బావ "
ఉరికురికి రావాలి "

6)

చేటంత మబ్బు పట్టి "
చెరువంత నిండాలి "

7)

తూరుపున మబ్బు పట్టి "
తుళ్లి తుళ్లి కురవాలి "

8)

పడమటను మబ్బు పట్టి "
పట్టి పట్టి కురవాలి "

9)

ఉత్తరాన్న్ని మబ్బు పట్టి "
ఉరుమురిమి కురవాలి "

10)

దక్షిణాన్ని మబ్బు పట్టి "
జల్లు జల్లున కురవాలి "

11)

ఈగ తల్లి నీళ్లాడి "
వీది వీది నిండాలి "

12)

దోమ తల్లి నీళ్లాడి "
దొడ్డెల్ల నిండాలి "

13)

కురవాలి కురవాలి "
కుంబ వృష్టి కురవాలి "