పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చీకట్లు ఆవరించాయి. జగమంతా దీపావళిలా దీపాలతో నిండింది.

“పద్మా !"

“బావా!"

“నువ్వు బి.ఏ. కూడా పూర్తి చేయాలి!”

“మీరు తలపెట్టిన సినీమా పూర్తి చేయండి!”

“మన కథే కొంచెం మార్చి, పేరులు మార్చి తీయిద్దాము.”

"ఛా! సిగ్గుకాదండీ!”

“నా గీతాదేవీ! నా ఆత్మలో అధివసించి ఉన్న పద్మా!”

ఆమె అతని ఒడిలో తలనుంచి అతని పాదాలు హృదయానికి అదుముకొంది. జాజిపూల పరిమళాలు జగమంతా నిండిపోయాయి.

ఓం అసతోమా సద్గమయ!
తమసోమా జ్యోతిర్గమయ
మృత్యోర్మా అమృతంగమయ.

★ ★ ★

అడివి బాపిరాజు రచనలు - 7

177

జాజిమల్లి(సాంఘిక నవల)