పుట:Jadakucchulu1925.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12

జడకుచ్చులు


తే. గీ. పూలతో నిండి కమ్మద ♦ నాలు చిమ్ము
పుస్తక నికుంజపుంజూళి ♦ పొంతఁబిలిచి
నాజనము, నాడు దేశి" మ ♦ సంగఁజులు
ఇంత జ్ఞాన భిక్షాదాన ♦ మిమ్ము తల్లి!

సీ, ఆంధ్రుల శిల్ప వి♦ న్యాసంబు చూపించు
కలిమి గోపురముల ♦ గలదటంచు
ఆంధ్ర నాగరిక క ♦ ళ్యాణచిహ్నములైన
గాన సాహిత్యముల్ ♦ గలవటంచు
ఆంధ్ర భాగ్యమ్ము మో ♦ యగ గౌతమీకృష్ణ
దరులను నాపలు ♦ దిరిగెననుచు
ఆంధ్ర వీరులకు స్వ ♦ ర్గాతిథ్యమిచ్చి పొ
టలుపాడిన యుగమ్ము♦ కల దటంచు
  
తే.గీ. చెప్పి యొప్పించు పుస్తక ♦ శ్రీకుమారి
యందగింపఁగఁ గల యాల ♦ యములుగట్టు
డాంధ్ర దేశమునందెల్ల ♦ నాంధ్రపుత్రు
లాప్తమా నవసంఘ సే ♦ వానురక్తి