పుట:Jadakucchulu1925.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆచారక్షయము

 
                            1
తీరు తీరుల నలం ♦ కారముల్‌ మృగ్గులఁ
                       జిత్రించు మవ్వంపు ♦ జేతిమేల్మి
పూసలతో బొమ్మ ♦ పోసిన యట్లు చ
                       క్కని కుట్టుపను లల్లు ♦ కాశలంబు
కైవారములు లేక ♦ యే వలయము లష్ట
                       దళరేఖల సమర్చు ♦ కలికితనము
పాడేటి రాటాల ♦ పాలు దీసినరీతి
                       సన్నదారముఁ దీయు ♦ జాణతనము
గీ.తెనుఁనాఁటి కులస్త్రీల ♦ దినదినంబు
   సన్నసన్నగ నణఁగారి ♦ చచ్చుచున్న
   వకట! ఈగృహజీవ దీ ♦ పికలు నిలువ
   స్నేహనిధికి భిక్షాటన ♦ సేయ రేమొ!
                           2
సీ.ఏడాది పొడుగున ♦ నింతతీరిక లేక
                    చేలలోఁ గష్టించు ♦ సేద్యకాండ్ర
   పెద్దపురాణాల ♦ విన నోచుకొనక యూ
                    రికి దూరులగు దుర ♦ దృష్టజనుల