పుట:JATHA.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శబ్దక్రీడ -లను ఆద్యంతమూ పరికించవచ్చు.

ఈయన రచనా పాటవానికి, శైలీ విన్యాసానికి, ప్రబోధకత/ సందేశాత్మకత -లకు మచ్చుతునకలుగా "రాములమ్మ పదాలు” లోని కవితలను పరిశీలిద్దాం.

"విలువైన రత్నమ్ము /గురువర్యు పాదమ్ము' - అని గురుపాద గురుత్వాన్ని ఎత్తి చూపాడు. ప్రజాకవి గోరేటి వెంకన్న గారి కవిత్వానికి ముగ్ధుడై 'తేనెలూరెడు ఊట,/గోరేటి నీ పాట" అని కళ్ళకద్దుకున్నాడు. మత దురహంకారాన్ని ఖండిస్తూ, "మతములన్నవి గతము/సమత, మామతలె ఘనము '* అని వెల్లడించాడు. స్నేహం గొప్పతనాన్ని వర్గిస్తూ, “"మధురామృతము, అమరత్వము కన్న గొప్పదిని చాటాడు. * తెలంగాణ పాటును 'తేనెలొలికే దేశి పదాల” కోటగా ఎత్తాడు. పాల్కురికి సోమన దేశి పదములను తన కవిత్వంలో పలికించిన వైనాన్ని శ్లాఘీంచాడు.

“ధన్యులు ఆడవారు" అని మహిళా పక్షపాతి అనిపించుకున్నాడు. 'కోమలిని చూసి జాబిలి చిన్నబోయింది" అని అతిశయోక్తితో సహజ సుందరంగా వర్ణించాడు.

"కందము రాసే వాడే కవి" - అన్న ప్రసిద్ధ్‌క్తిని తలపిస్తూ - రాములమ్మ సరళ సహజ సుందర సౌకుమార్యాన్ని, కంద పద్య కాఠరిన్యత కన్నా ఉత్తమమైనదిగా పోల్చ్పడమూ ప్రశంసనీయము. మానవ సేవ, మాధవ సేవ కన్నా గొప్పదనే సందేశం “నిదురోయెను దేవుడు" లో వ్యక్తమైంది. ఇకనానీల ప్రస్తావనకు వస్తే...

'నవ్వడం, నవ్వులాట కాదు. యువతుల నవ్వులు ఎన్ని హృదయాలను నలిపివేస్తాయో' అని అనుభవపూర్వకంగా కాకపోయినా అట్టి వయో స్థితిలో ఉండుట మూలాన పరకాయ ప్రవేశం చేసి చెప్పి ఉండవచ్చు.

భార్య, అమ్మ - ల ప్రేమ జెన్నత్యం ఒక దానితో నొకటి పోటీ పడేలా ఉండాలి. కాని ఒకదానినొకటి అడ్డుకోరాదనే భావన ఆమోఘం.

ఛందస్సు పైకి కఠినంగా తోచినా దాని ఫలితంగా వెల్లివిరిసిన పద్య కుసుమాలెంత గొప్ప సుందర, సుగంధ భరితాలో తెలియజేశాడు.

మట్టిని నేరుగా మనం తినలేకపోవచ్చు. కాని ఆ మట్టి పెట్టిన భిక్షనే మనమంతా ఆహారంగా తీసుకుని జీవిస్తున్నా మన్న సత్యాన్ని మరొకసారి లోకానికి తెలియజేశాడు.

అందమనేది ఎక్కడో లేదు. ఆనందమే. దాని స్థావరమని అనుభవించమంటున్నాడు. ఇంక్సాతల్లి ప్రేమ ముందు సముద్రమూ, యావత్‌ జగత్తు కూడా దిగదుడుపేనని తేల్చాడు.

నిజాం రాజులు పోయినా వారి తాలూకు బూజులు మాత్రం పోలేదని

"https://te.wikisource.org/w/index.php?title=పుట:JATHA.pdf/5&oldid=376212" నుండి వెలికితీశారు