పుట:Indrani-Saptasathi-in-Telugu-By-Vasishtha-T-Ganapati-Muni.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్త. 3.

ఇంద్రాణీ సప్తశతీ

49



22. ఓ తల్లీ ! పూర్ణముగా నాత్మార్పణ చేయనివాడైనను, సమాధి యందు జ్ఞానములేనివాడైనను, యెవడు నిన్ను జపాదులతో నిత్యము సేవించుచుండునో,


23. ఓ యింద్రాణీ, వానిని నీ వచంచలభక్తిగలవానిగా జేసి, సర్వ కామములను దీర్చి, వానికి క్రమముగా (ఆత్మ) నిష్ఠ నిత్తువు. (ఇదియు స్వానుభవమే)


24. ఓ తల్లీ ! వేలకొలది సంఘములుగా విచ్ఛిన్నమై, శత్రు భారముచే ఖిన్నురాలైన భారతదేశమును రక్షించుటకు మాకు బల మిమ్ము.


25. ముల్లోకములను భరించుటచే నలసియున్న ఇంద్రాణికి గణపతి యొక్క యీ మదలేఖావృత్తములు లెస్సగా ముదము గూర్చు గాక.

__________


1. మిగుల కాంతిమంతములగు ఇంద్రాణీ మందహాసములు మోహకారణమైయున్న నా హృదయమందలి యజ్ఞానమును నశింపజేయుగాక.


2. అమృతమును జిమ్ముచు, నీ లోకమందు ప్రసరించు ఇంద్రాణీ దృష్టి (వెన్నెలతో పోలిక) భారతభూమికి బలమిచ్చుగాక.


3. ఓ తల్లీ ! అమృతోదకమును జిమ్మునట్టిది, కారుణ్యోదకమును వహించునట్టిది, నమ్రులను రక్షించుటకు దీక్ష బూనినది నీ చూపగుచున్నది.