పుట:Indrani-Saptasathi-in-Telugu-By-Vasishtha-T-Ganapati-Muni.pdf/267

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్త. 4.

ఇంద్రాణీ సప్తశతీ

253



24. ఆ యింద్రాణి ధనశక్తి బంధుబలము లన్నింట హీనుడై యున్న గణపతిమునిని కృపతో జూచి, భారతదేశ శుభము నొడగూర్చు వారిలో బ్రథమునిగా జేయుగాక.


25. సుకవిరాట్టైన గణపతియొక్క యీ 'ప్రమితాక్షర' వృత్తము లధిక కాంతి గుణశక్తులు గలిగిన ఇంద్రాణీదేవిని సంతోషము తోడను, నేర్పుతోడను వినునట్లు చేయుగాక.


__________


1. చంద్రునివలె ధవళమైనది, చీకటి సమూహములను నివారింప సమర్ధమైనది, యెన్ని జన్మముల పాపములనైనను నశింపజేయునట్టిదియైన యింద్రాణీ మందస్మితలేశము నాకు శుభము గూర్చుగాక.


2. దేవేంద్రుని రాణియైన సవిత్రి - మార్గము తెలియక విషణ్ణురాలై చిరకాలమునుండి గతికోల్పోయి స్తంభించియున్న భారత భూమిని రక్షించుగాక.


3. ఈ భువనసృష్టికి పూర్వము నిరాకార నిర్మలమై యేది యంతటను నుండెనో, మంగళప్రదమైన ఆప్రకృతి నా బుద్ధిని తీక్ష్ణ మొనర్చుగాక. (అట్టి ప్రకృతినే పరదేవతయందురు)