పుట:Indrani-Saptasathi-in-Telugu-By-Vasishtha-T-Ganapati-Muni.pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్త. 3.

ఇంద్రాణీ సప్తశతీ

251



19. నరులనురక్షించు నో తల్లీ, యింద్రాణీ ! కులరక్షణమందు బుద్ధి గలిగియున్న వీనిని (కవిని) సమర్థునిగా జేయుము.


20. ఓ జననీ ! ఈ నా కులమందున్న మందబుద్ధు లింద్రనామమును, నీ నామమును గూడ విడిచిపెట్టిరి. నా ముఖముజూచి యతిఘోరమైన యీ యపరాధమును నీవు క్షమింపుము.


21. ఓ శచీ ! 'శారద' యని యీ లోకములో యతులచే నే దేవి పొగడబడుచున్నదో, ఇంద్రుని భార్యగా ప్రసిద్ధిజెందిన యే కాంత భూమియందు బ్రకాశించుచున్నదో, శుభ చరిత్రగల నామెయు నీ కళగానే యున్నది.

(అనగా శంకరాచార్య ప్రతిష్ఠితమైన 'శారద' యను విద్యా రూపిణి భూమియందు బ్రకాశించు నింద్రాణీకళయని భావము)


22. వివిధావతారములందు బ్రకాశించు చరిత్రగల ఆ యింద్రాణి యరుణాచలేశ్వర గుహను వసతిగా జేసికొని తపమొనర్చు గణపతిమునికి కుశలము చేయుగాక.


23. ఓ రమణీ! అరుణాచలగుహచే ప్రతిధ్వనింపబడుచు, గణపతిచే కలుషహరణముకొఱకు రచింపబడిన యీ కథాస్తవము చారు తరమై, నిజమై, నీ యశస్సంబంధమై, నీచే శ్రవణము చేయబడు గాక.