పుట:Indrani-Saptasathi-in-Telugu-By-Vasishtha-T-Ganapati-Muni.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్త. 3.

ఇంద్రాణీ సప్తశతీ

249



15. శత్రునాశనము గావించినది ధర్మరాజుయొక్క ఘోరతపస్సు కాదు, అర్జునుని పటుతరబాహుబలము కాదు. అపచార మొనర్పబడిన నీ వేణీపన్నగమే బహుళశత్రునాశము గావించెను.


16. కృష్ణవర్ణమైనను కాంతిమంతమై, మహిమగలిగి, వనితా జనమును మోహింపజేసిన ఇంద్రశక్తికళా భరితయగు ద్రౌపది నాకు కుశల మొనర్చుగాక.


17. ఓ పతిత పావనీ ! సమస్త జన పాపభారమును (నుపలక్షితముగా) వహించి శిరస్సంబంధమగు నే వేణియందు (కృష్ణునిడైన) ఇంద్రునిచే నభయమీయబడుటకు భూమిపై నీ వవతరించితివో, ఆ (వేణిగల) కన్యకను భూమియందు నీ కళయే ప్రవేశించెను.

(ధర యనగా భూమికి, మెదడుకు గూడ నర్థమున్నందున ద్రౌపదియొక్క శిరస్సు సమస్త జన పాపభారమును వహించు భూమి కుపలక్షణము. అభయ మొసగబడిన వేణి భూమియందు పాపముచే పీడింపబడిన జనకోటిని నిరూపించును. అట్లు నిరూపించు లక్షణములను శిరస్సున వేణియందు బొంది పుట్టిన ద్రౌపది కభయమొసగిన సమయమున నామె నింద్రాణీ కళ యా వేశించి నట్లెంచవలెను. ఆ యావేశావతరణమున కుపాధి యగుటకై పుట్టిన పవిత్ర వ్యక్తి ద్రౌపది యని భావము.)


18. ఓ యఖిలాంబ ! అతి బలమైన నీ కళతో గూడిన అనఘ చరిత్రు రాలగు రేణుక పురుషావతరణము వేఱుగా లేకుండగనే పురుషుడైన అఖిలేశ్వరుని తేజస్సును గూడ కలిగియున్న ట్లాతేజమును తన కుమారునియందు బొందగల్గెనుగదా !