పుట:Indrani-Saptasathi-in-Telugu-By-Vasishtha-T-Ganapati-Muni.pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్త. 3.

ఇంద్రాణీ సప్తశతీ

247



10. ఓ యమోఘదయావతీ ! ఈ భారతభూమిని నీవు రక్షింపుము. అందుల కీ జనుడు సాధనమగుగాక (గాంధీవలెనే వేఱొక రంగమున). నీ నిజ (పాద)పద్మమును చిర కాలమునుండి భజించు వీనిని విడచివేయకుము. (కవి తన కార్యశక్తిని నిరూపించెను.)


11. ఓ యింద్రాణీ ! పూజనీయమగు బహుగుణములుగల యెవరిని కవులు పతివ్రతలలో ప్రథమురాలని, శ్రేష్ఠురాలని చెప్పు చున్నారో. ఆ యజ్ఞ సేనియగు ద్రౌపదిని గూడ నీవు నీ కళచే బ్రవేశించితివికదా.

(రేణుకయందు శిర శ్ఛేదమైనప్పు డింద్రాణి యావేశించినట్లే ద్రౌపదియందు కేశములచే నీడ్వబడినప్పుడు శక్తియావేశించి దేవకార్య కారణము వహించెను.)


12. పుణ్యాత్ముడైన యెవడీ లోకములో భారతమును పఠించునో, వాడు సకల పాపములను నశింపజేసికొనిన వాడగును కదా ! ఓ యంబయైన ద్రౌపదీ ! ఇది నీ కథయొక్క మహిమమే కదా!


13. ఆర్యులకు పూజ్యురాలవైన దౌపదీ ! కృష్ణు డధిక గుణములు గల సుభద్రను మించి నిన్నధిక ప్రేమభావముతో జూచిన విషయమునకు నీయొక్క కొనియాడదగిన శక్తి కళయే కారణమై యుండును.


14. ఓ యంబా ! నీవు పాండవులకు భార్యవై గృహకార్య తంత్రము లందు చతురు రాలవై, సకలేంద్రియముల కమృతఝరీవంటి రమణివై నీతిమార్గకథనమందు సచివురాలవుగూడ నైతివి.