పుట:Indrani-Saptasathi-in-Telugu-By-Vasishtha-T-Ganapati-Muni.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్త. 2.

ఇంద్రాణీ సప్తశతీ

241



21. నిగూఢవైభవముగల పుణ్యములు ప్రకాశింపకుండగా, ఫలములనిచ్చు పాపములు ప్రకాశించుచుండగా. మనస్సు వికలత్వము బొందియుండగా, తల్లీ. నీ చరణమే శరణు బొందు చుంటిని.


22. ఓ యంబా ! శత్రువు సమర్థుడై యుండగా, రోగము భయంకరమై యుండగా, నమ్రులను రక్షించుటకు నిపుణురాలవైన నీ చరణమును నేను శరణు బొందుచుంటిని.


23. ఓ తల్లీ ! దేవతాసమూహముల కిరీట మణికాంతులనెడి కుండలినీ కిరణములను బొందినట్టి, మిగుల యెఱుపుగా నున్నట్టి, విపత్తులను తొలగించి యజ్ఞానమును నశింపజేయునట్టి నీ చరణము నాకు శరణము.


24. ఓ యీశ్వరీ ! వైభవము గోల్పోయిన నా యీ జన్మభూమిని తిరుగ లక్ష్మీప్రధము గావించుకొనుటకు గణపతి హస్తమునకు పటుత్వమునిమ్ము.


25. ఇంద్రాణీదేవిపై గణపతిచే రచింపబడిన నిర్దుష్టమగు 'జలోద్ధత' గతి గల యీ స్తవము భారతదేశ జనుల భయమును బోగొట్టి వారిని రక్షించుగాక.


___________