పుట:Indrani-Saptasathi-in-Telugu-By-Vasishtha-T-Ganapati-Muni.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్త. 2.

ఇంద్రాణీ సప్తశతీ

235



4. పరాకాశరూపమందు గుణముతో గూడనిదానవై నీవు మూలమైన సద్రూపునకు బుద్ధి లక్షణవైయుంటివి (కర్తప్రచురణబుద్ధి), యిచ్చటనున్న ఆకాశతనువుతో నీవు ప్రపంచమును పోషించుచు రక్షించుచుంటివి. స్వర్గమనెడి గుణమునకు బలమునిచ్చు ప్రాణేశ్వరివైనీవు స్వర్గమం దింద్రుని ప్రియురాలివైతివి. ఓ శచీ ! నీ స్వరూప కథ యిది.


5. ఓ సురాసురస్తూయమానులాలా ! పురాణపురుషుడైన ప్రజాపతి స్థానమందు నీవు 'అదితి' వై స్మరింపబడుచుంటివి. ఉత్కృష్ట జనార్దనపదమందు 'లక్ష్మి' వై నీ వుంటివి. నాశనరహితమైన సదాశివపదమందు నీవు 'శివ' వై యుంటివి.


6. సూర్యుని స్థానమున 'ఉష' వై, అగ్ని పదవియందు 'స్వధ' వై, యింద్రపదమందు 'శచి' వై కవులచే నా యా స్థానముల కుచితపదములతో పిలువబడితివి. వేదవాక్కులో మీ రుభయులు జ్ఞాతృ, జ్ఞానము లగుదురు.


7. అమేయుడు, నచింత్యుడు నగు పురాణపురుషునినీ కవులతని సంబంధమగు వైభవములను దెలుపు పదములతో పిలుచు చున్నారు. దేవీ ! నిన్ను గూడ వా రట్లే పిలచిరి. మతభేద మందులకే (అనగా వైభవ నామములందున్న భేదముచే) గలిగెను.


8. ఓ సవిత్రీ ! ఆకాశము, వాయువు, పరావాక్కు, వ్యాపించిన తటిత్తు, సూర్యుడు, చంద్రుడు, అగ్ని, జలము, పృధ్వి - యీ సర్వము మీ యిద్దరియొక్క యైశ్వర్య స్వరూపమే.