పుట:Indrani-Saptasathi-in-Telugu-By-Vasishtha-T-Ganapati-Muni.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్త. 4.

ఇంద్రాణీ సప్తశతీ

173



22. పశ్చిమదిక్కున బ్రవహించుచు (వెన్నెముకయందున్న సషుమ్న యందు) గొప్ప మదమును గలిగించుచుంటివి. నీవు తూర్పు దిశ (ముందువైపున్న హృదయమందు - సూర్యుడు ప్రకాశించు వైపు) బ్రవహించి బుద్ధికి శాశ్వతసిద్ధి నిమ్ము.

(పాశ్చాత్య దేశములు, ప్రాగ్దేశములు శ్లేషచే నుద్దేశింపబడెను)


23. ఓ తల్లీ ! నిర్మలమైన సుషుమ్న నధిష్ఠించి మదముకొఱకు ప్రవహించుచుంటివి. అమృతానాడి నధిష్ఠించి (శిరస్సునుండి ముందు వైపునకు హృదయమువరకు నుండు సూక్ష్మనాడి) కొంచెము బుద్ధిబలముకొరకు ప్రవహింపుమా.


24. ఓ దేవీ ! భారతభూమిని రక్షించుటకై నా మనస్సునం దుపాయములుచెప్పి, భక్తుడనైన నన్ను శక్తిమంతునిగా జేసి, కృతకృత్యుని గావింపుము.


25. నరసింహపుత్రుడైన కవిశ్రేష్ఠునిచే రచింపబడిన కమనీయ 'మేఘవితాన' వృత్తము లింద్రాణికి దృప్తినిచ్చుగాక.


_________