పుట:Indrani-Saptasathi-in-Telugu-By-Vasishtha-T-Ganapati-Muni.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్త. 2.

ఇంద్రాణీ సప్తశతీ

153



18. సర్వేశ్వరుని వీర్యము ధరించుటచే ఆకాశము స్త్రీ యనబడెను. సర్వలోకకారణబీజమును ధరించియుండుటచే నా కాశము పురుషుడని వచింపబడెను.


19. నియత వాదినులు (అనగా కంటికి గోచరమగునదియే నమ్మువారు) స్ఫుట శరీరలక్షణము లాకాశమందు గోచరించనందున, దానిని మనవలె పురుషుడుగాగాని, స్త్రీగాగాని లేదనిరి.


20. ఆలాగున కాకున్నను, సర్వవ్యాప్తమైన అవికార సద్వస్తువు శచీంద్రుల యభేదముచే శ్రేష్ఠ స్త్రీలక్షణమును, ఆకాశశరీరమును బొందినట్టి యుత్తమ పురుషునివలె గణింపబడవచ్చును.


21. ఓ తల్లీ ! నిర్మలమైన దేహమను దుర్గమునకు మధ్యముననుండి విశాలాకాశముకంటె స్వల్పమైనను శ్రేష్ఠత్వ మందు తీసిపోని యీ హృదయము నీకు సౌధమగుగాక.

(ఆకాశమం దుంచబడిన సద్రూపలక్షణమగు వీర్యమే హృదయమైనట్లు ధ్వనించును. సత్తే ఆకాశమునకు వీర్యలక్షణమైనదని భావము. 'అయితిని' అను నర్ధముగల హృదయము (హృత్ + అయం) ఆకాశమునుబొందిన సచ్చిత్ లక్షణము.)


22. ఓ యంబా ! స్వకీయకిరణములచే వికసించిన నా హృదయ మనెడి యాలయమును, వేడి కిరణములుగల సూర్యునిచే వికసింపబడిన సహస్రదళపద్మమును లక్ష్మీదేవివలె ప్రవేశింపుము. (హృదయవస్తువు సూర్యునకు సామ్యము. ఈ యాలయమున