పుట:Indrani-Saptasathi-in-Telugu-By-Vasishtha-T-Ganapati-Muni.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్త. 1.

ఇంద్రాణీ సప్తశతీ

143



19. ఓ తల్లీ ! ఎవడు శ్రేష్ఠమైన నీ యాకాశరూపమును జూచుచు, సదా యుపాసన జేయుచుండునో, వానిని పాపము తాకదు.


20. పున్నమచంద్రుని బోలు ముఖము, వికసించిన పద్మదళములు వంటి నేత్రములు, నైర్మల్యమునకు నిధియైన మందహాసము, వర్షకాల మేఘమువంటి కొప్పు,


21. రత్న ఖచితమైన అద్దమువంటి చెక్కిళ్లు, చంపకమువంటి సొంపైన నాసిక, మల్లిమొగ్గలవంటి యందమైన పలువరుస, కల్ప వృక్షముయొక్క చిగురువంటి రంగుగల యధరోష్ఠము,


22. ఇష్టమైన వరములను, అభయమునిచ్చు హస్తములు, సర్వ దేవతలచే నమస్కరింపబడు పాదములు, విలువలేని దివ్యరత్న భూషణములచే నలంకృతమై బంగారుఛాయవంటి వర్ణముగలిగి,


23. దివ్యమైన తెల్లనివస్త్రములు (రెండు - లోవస్త్రము, పైవస్త్రము) ధరించునది. యింద్రుని నేత్రముల కింపయినదియగు వరాంగన యొక్క శరీరము నెవడు స్మరించునో, వానిని పాపములు తాకవు.