పుట:Indrani-Saptasathi-in-Telugu-By-Vasishtha-T-Ganapati-Muni.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్త. 1.

ఇంద్రాణీ సప్తశతీ

141



13. బుద్ధిశాలులు వ్యాపకత్వముతో గూడిన విశాల దేశమును శక్తి భాగముగా చెప్పుచున్నారు. విచక్షుణులైన మఱికొందఱేది యా కాశమని చెప్పబడుచున్నదో, దానిని 'సవిత్ర' యనియు, 'అదితి' యనియు పిలచిరి.


14. నిత్యమోదరూపమైన శక్తి భాగమును పండితులు 'భద్ర' యను చున్నారు. చతురోక్తిమంతు లామెనే 'శివ' మ్మనుచున్నారు.


15. పండితులచే గణింపబడు శక్తియొక్క వీర్యరూప భాగమే 'శవసి' యని చెప్పబడుచున్నది. ఆ వీర్యాంశ ఓజస్సుకంటె మించి వేఱుగాలేదు. ఈ యుగ్రమగు వజ్రాయుధము కూడ దానికంటె వేఱుగాలేదు.


16. గూఢభాషలో వజ్రమే ప్రచండచండికయని చెప్పబడుచున్నది. ఏ చండికయొక్క విభూతి లేశముచే చుంబితుడైన పురుషుడు పృథ్విలో నెవరిచేతను జయింపబడజాలడో

(అట్టి చండికయని ముందు వాక్యముతో నన్వయము)


17. ఉదారకీర్తిగలిగి సర్వవ్యాపినియైన శక్తి పండితులచే శచీదేవిగా చెప్పబడెను. సర్వము నిరూపించు నామముగలది, పావనమైనది, పురాతనమైనదియైన యీ పేరు మాకు ప్రియమైనది. (శచీనామము)


18. ఓ దేవీ ! ఏ మనుజు డాకాశశరీరము దాల్చినట్టి, దివ్యస్త్రీ తనువును బొందినట్టి నీ శచీనామమును కీర్తించునో, వానిని పాపము పొందదు.