పుట:Hungary Viplavamu.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అయినా మెరుపులాగ అనిమిషంలో ఆవేశం వచ్చిందతనికి. అతడిలాగే ఏమీ ఎరగని మరికొంత మంది యువకులూ ఆగుంపులో చేరారు.

ఆగుంపులోంచి నొకనివాదం బయలుదేరించి. ఆశాజనకమైన నినాదమది. ఆవేశపూరిత మైంది. ఉత్సాహభరితమైంది. గుంపులో వొక విధ్యార్ధి అరిచాడు. "హంగేరీనించి ఏవివో తరిమేస్తాం' ఈమాటలు జోసపుకి అర్ధమయాయి.

యువకులగుంపు నొక్కసారి సముద్రంలా ఉప్పొంగింది, పోలీసుస్టేషనులో దూరింది. తలుపులు బద్దలుకొట్టి లోపల ప్రవేసించింది. ఆఫీసర్లు కంగారు పడిపోయారు. శాంతపరచడానికి ప్రయత్నించారు.

"మీ తుపాకులు ఇటు తెండి" అంటూ అరిచారు యువకులు.

"నీతుపాకి ఇటుతే" వొక పోలీసు ఆఫీసరుని ఉరుముతూ అన్నాడు జోసపు. తనధైర్యానికి తనకే ఆశ్వర్యం వేసింది.

"ఎందుకోసం?' తడబడుతూ అడిగాడు పోలీసు. జోసపు జవాబు చెప్పలేదు. తీక్షనంగా చురచురా ఛూశాడు.

'ఏవివోని అంతంచేస్తాం' వొకవిధ్యార్ధి అరిచాడు. పోలీసు నోరు వెళ్ళబెట్టాడు. కళ్ళుతేలఏశాడు. జోసపు అతడి పిస్తొలు లాక్కున్నడు. తనకంటే బలమైన మరొకయువకుడు అతడు చేతిలోంచిల్ లాక్కున్నాడు. చూస్తూవుండగానే పోలీసు తుపాకులు కొట్టమంత యువకుల వశమయిపోయింది. యువకులంతా వీధిలోకి వచ్చేసరికి ప్రతి యువకుడు చేతిలోను తుపాకి వుంది.

వాళ్ళాదృష్టమా అన్నట్టు సరిగ్గా అదేవేళకి హంగేరియను సైకులు నడిపిస్తూన్న వొకటాంకు ఆసందులోకి వచ్చింది. భయంకరంగ వుంది దానిశబ్దం. జోసపువున్నదిక్కె అది నదుస్తూవచ్చింది. ఇద్దరు ఏవివో మనుషులు దనికి దారి చూపిస్తున్నారు. అది పాతకాలపుటాంకు, T.34 అది నడుస్తూ వుంటే ఎంతో చప్పుడవుతూ వుంటుంది. దానికి మరతుపాకులు బిగించి వున్నాయి. పిస్తోళ్ళతో దానిని అదిరించడం అసంభవం

దానిని చూసి మొదట ఏమీతోచలేదు యువకులికి. భయబ్రాంతులయి నిలబడి పోయారు వాళ్ళు. కుర్రాళ్ళమీద తుపాకులు పేల్చడం ఇష్టంలేదు టాంకులో సోల్జర్లకి. తమదగ్గిర వున్న చిన్న ఆయుధాలతొ టాంకుని కొట్టడానికి యువకులు భయపడ్డారు. ఇంతలో టాంకులోని ఎవివో మనుషులు