పుట:Hindujana Samskarini-1-3-1912.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ

హిందూజన సంస్కారిణి.

ప్రత్యాంగ్లేయ మాసాంత్యమునఁ

బ్రకటింపఁబడు

వివిధవిషయక మాసపత్త్రిక.


ద్వితీయకల్పము
సంపుటము 1

1912 అక్టోబరు
1912 October

సంచిక
3


స్వవిషయము.

ఆర్యమహాశయులారా! "హిందూజన సంస్కారిణి" అను పేరంబరఁగు మాసపత్రికను చాలకాలము నా తండ్రిగారైన మన్నవ బుచ్చయ్య పంతులుగారు ప్రకటించుచున్న విషయము జగద్విదితమే కదా. వారు స్వర్గవాసులైన పిమ్మట నీపత్రికా ప్రకటనము నిలిచిపోయెను. ఇపుడు మరల దీనిని ప్రకటింపుఁ డని పలువురు ప్రోత్సాహము చేసినందునను, (శ్రీ యు తు లు అస్మన్మాతులులు మద్దాళి సుబ్రహణ్యయ్య పంతులుగారును, మద్దాళి ఆదినారాయణయ్య పంతులుగారును మూఁడువందల రూపాయలు విరాళముగా నొసంగి మదియేష్ట సిద్ధికి తోడ్పడినందునను, ఈ ప్రకటింపఁ దొడంగి నాఁడను. ఇందు ఇంతకుమున్ను ముద్రింపఁబడిన ఉపనిషత్తుల కెల శ్రీశంకరాచార్య కృత వ్యాఖ్యానమును, ఆనందగిరి టీకానుసారముగ తాత్పర్యమును ముద్రింపఁబడును. మఱియు కేవలము వేదాంత గ్రంథములను మాత్రమే గాక తత్కాలో (చితము నితర గ్రంథములను గూడఁ బ్రకటింపఁబడును. మహాభాగు లగు వారెల్లరును ) నా తండ్రి గారియందుంచిన యభిమానమును నా యందునుంచి పత్తికాభివృద్ధి చేయం ఆదర్యబడియెదరు. మఱికొందఱకును పత్రిక పంపఁబడినది. ఎల్లగును పత్తికాగ్రహీతలై పోషకులుగను చందాదారులుగ నుండి సహకారు లగుదుగని ప్రార్థించుచున్నాఁడను, భిజులకు విశేషముగా విన్న వింపఁ బని లేదు,