పుట:Hello Doctor Final Book.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రావడము వాటిని మరల కబళించడానికి మరికొన్ని తెల్లకణాలు, భక్షక కణాలు చేరడము, ఆ ప్రాంతములో తాప ప్రక్రియ (Inflammation) కలగడము జరుగుతాయి. కాల్షియం కూడా క్రమేణ  చేరి ఫలకలు (Plaques) ఏర్పడుతాయి. ఈ విధముగా ధమనులు బిరుసెక్కి నాళముల లోపలి పరిమాణము కుచించుకు పోతుంది. ఈ ఫలకములు పగుళ్ళు పెట్టినపుడు అచ్చట రక్తము గడక ్డ డితే రక్తప్రసరణకు అంతరాయము కలుగుతుంది. హృదయ ధమనులలో ఈ ప్రక్రియ కలుగుతే గుండెపోటులు, మస్తిష్క రక్తనాళాలలో యీ ప్రమాదము జరిగినపుడు మస్తిష్క రక్తనాళ విఘాతాలు (Cerebro vascular accidents) కలుగుతాయి.

ఈ ధమనీ కాఠిన్యమును అదుపులో పెట్టాలంటే ఆ కారణాలను అదుపులో పెట్టాలి కదా! రక్తపుపోటును అదుపులో ఉంచడము, మధుమేహ వ్యాధిని నియంత్రించడము, ధూమపానము మాని వేయడము, తగినంత వ్యాయామము చేయడము, శరీరపు బరువును అదుపులో ఉంచడము అవసరము. రక్తములో ఉన్న కొలెష్ట్రాలు, ట్రైగ్లిసరైడులు (Triglycerides) అనే  కొవ్వులు ఎక్కువగా ఉంటే వాటిని తగ్గించే ప్రయత్నాలను చెయ్యాలి కొలెష్ట్రా లు ( Cholesterol) :

ఇది ఒక రకమైన కొవ్వు. పైత్యరసము (Bile) లోను, పిత్తాశయములో (Gallbladder) ఏర్పడే రాళ్ళలోను ఉన్న దీనిని తొలుత కనుగొన్న తరువాత కొలెష్ట్రాలు వివరాలను శాస్త్రజ్ఞులు తెలుసుకున్నారు. వృక్షములలో కొలెష్ట్రా లు చాలా చాలా అరుదు. కాని జంతుజాతులలో కాలేయములో (Liver) విరివిగాను, అన్ని కణాలలోను కొలెష్ట్రాలు ఉత్పత్తి జరుగుతుంటుంది. వృక్షజాతి కణాలకు కణకుడ్యాలు (Cell Walls) ఉన్నట్లు జంతువుల కణాలకు స్థిరమైన గోడలు ఉండవు. జంతుకణాలకు పైపొరలే  (Cell membranes) ఉండడము వలన కణాల ఆకారము మారుటకు, చలనానికి, కావలసిన సారళ్యము, మృదుత్వము చేకూరుతుంది. జంతుకణముల పైపొరలు,కొలెష్ట్రాలు, ఫాస్ఫోలైపిడులు (Phospholipids),ఎపోప్రోటీనులుతో (apoproteins) నిర్మితమవుతాయి. పైత్యరస ఉత్పత్తికి, ఎడ్రినల్ వినాళగ్రంధుల స్రావకాల ఉత్పత్తికి, స్త్రీ, పుంస్త్వ హార్మోనుల (Estrogen

51 ::