పుట:Hello Doctor Final Book.pdf/373

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

35. జలుబు ( Common Cold ) మనలో జలుబు రాని వారెవరూ ఉండరు. చాలామందిలో జలుబు వచ్చి దానంతట అది కొద్దిదినాలలో తగ్గిపోతుంది. కాని కొద్ది మందిలో దాని పర్యవసానముగా మధ్య చెవిలో తాపము (otitis media), నాసికా కుహరములలో తాపము (nasal sinusitis), ఊపిరితిత్తులలో తాపము (bronchitis) కలుగ వచ్చును. జలుబు విషజీవాంశముల వలన కలుగుతుంది. ఎక్కువగా నాసికా విషజీవాంశములు (Rhinoviruses) జలుబుని కలిగించినా, యితర ఎంటరో వైరసులు (Enteroviruses), కొరోనా విషజీవాంశములు (Coronaviruses), ఎడినోవైరసులు ( Adenoviruses ), పారాఇన్ ఫ్లుయెంజా వైరసులు ( Parainfluenza viruses ), వ్యాపకజ్వర విషజీవాంశములు (Influenza viruses), హ్యూమన్ రెస్పిరేటరీ సిన్ సిషియల్ వైరసులు (Human respiratory Syncytial  viruses ), జలుబుని కలిగించ గలవు. నాసికా విషజీవాంశములు (Rhinoviruses) పికోర్నా వైరసు సముదాయములో ఉన్న ఎంటెరో వైరసులకు చెందుతాయి. వీటి పరిమాణము అతి సూక్ష్మముగా ఉంటుంది. వీటి ఆకారము వింశతిఫలక ఆకారము (Icosahedral). ఇవి ఒంటిపోగు రైబోన్యూక్లియక్ ఆమ్లమును కలిగి ఉంటాయి. మానవ నాసికా విషజీవాంశములలో A, B, C అనే మూడు ప్రధాన తెగలలో, జన్యుపదార్ధములో మాంసకృత్తుల బట్టి 160 రకాలు ఉన్నాయి. ఈ విషజీవాంశములు జలుబు ఉన్నవారి నుంచి తుమ్ము, దగ్గుల ద్వారా బయటకు వెదజల్లబడుతాయి. వస్తువుల ఉపరితలములపై  పద్దెనిమిది గంటల వఱకు ధ్వంసము కాకుండా మనగలుగుతాయి. దగఱ ్గ లో ఉన్న వారు ఆ వెదజల్లబడిన విషజీవాంశములను పీల్చినా, లేక ఆ విషజీవాంశములు ఉన్న వస్తువులను తాకి ఆ చేతులతో ముక్కును

372 ::