పుట:Hello Doctor Final Book.pdf/331

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వలన కలిగే నష్టముల వివరాలు పూర్తిగా తెలియవు. శస్త్రచికిత్సలు :

బరువు విపరీతమైనప్పుడు ఎక్కువ బరువు వలన హృద్రోగములు, మధుమేహము యితర రుగ్మతలు ఉన్నప్పుడు బరువు తగ్గించుటకు శస్త్రచికిత్సలు అందుబాటులో ఉన్నాయి.   జఠర బంధన చికిత్స ( Laparoscopic Gastric Banding ):

భార సూచిక 40 దాటిన వారికి, లేక 35- 40 లో ఉండి హృద్రోగము, అదుపు కాని మధుమేహవ్యాధి ఉన్నవారికి మిత ఆహార, వ్యాయామ చికిత్సలు విఫలమైనప్పుడు జఠరబంధన చికిత్సలు అవసరము అవవచ్చును. ఉదరాంతర దర్శనము ద్వారా ( Laparoscopy ) జీర్ణాశయము (Stomach) చుట్టూ వ్యాకోచింపగల పట్టీ అమర్చి జీర్ణాశయమును రెండు తిత్తులుగా విభజించుట వలన పై భాగపుతిత్తి  కొద్ది ఆహారముతోనే నిండి ఆకలి తీరుతుంది. జఠరము, ఆంత్రములు ఉండుట వలన విటమినులు ఖనిజ లవణముల గ్రహించబడుతాయి. జఠరబంధన పరిమాణమును  మార్చుతూ జీర్ణాశయపు తిత్తుల పరిమాణములు మార్చవచ్చును. జఠర ఛేదన ( Gastric Resection ):

ఈ శస్త్రచికిత్సలో, జీర్ణాశయములో చాలాభాగమును తొలగిస్తారు. జఠరములో చిన్నతిత్తినే ఉంచి దానిని ఆంత్రములకు జతపరుస్తారు. (Partial Gastrectomy with Gastro jejunal anastomoses). లేక నిలువుగా చాలా భాగమును తొలగించి ( Vertical Gastric resection) జీర్ణాశయ పరిమాణములో కొంత భాగమునే ఉంచవచ్చును. ఈ చికిత్సలు పొందిన వారికి విటమినులు, ఖనిజ లవణములను సమకూర్చాలి. ఆంత్రములలో కొంత భాగమును తొలగించే శస్త్ర చికిత్సలు అఱుదు అయిపోయాయి. కడుపు బుడగ ; జఠర బుద్బుదము ( Gastric Balloon ) : తాత్కాలికముగా

జీర్ణాశయములో వ్యాకోచింపగలిగే బుడగను

330 ::