పుట:Hello Doctor Final Book.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కలిగించక ఉండవచ్చును. మరి ప్రమాదకరమైన కర్కట వ్రణములు, (Cancers) అపాయకరము (malignant). పుట్టకుఱుపులు  (Cancers) త్వరగా పెరుగుతాయి. శరీరములో వివిధ అవయవాలలోను ఈ పెరుగుదలలు పొడచూపవచ్చును. ఒకచోట ప్రారంభమైన యీ వ్రణాలు ఆ అవయవముల లోను, మిగిలిన అవయవాలకు వ్యాప్తి చెంది ప్రమాదభరితము అవుతాయి.

శరీరములో అవయవాల శైథిల్యము వలన శిథిల వ్యాధులు (Degenerative diseases) వస్తాయి. వృద్ధాప్యములో అవయవాల క్షీణత చూస్తుంటాము.

పొగత్రాగుట, పొగాకు వినియోగము, మితము దాటి మద్యము త్రాగడము, మాదక ద్రవ్యాల వినియోగము, పోషకపదార్థాల లోపము, శరీర అవసరాలకు మించి తినుట, భౌతిక జడత్వము వంటి  జీవన రీతులు (life styles) వ్యాధులకు దారితీయ వచ్చును.

ఇవి కాక మానసిక వ్యాధులు కొందఱిని పీడిస్తాయి. క్రుంగుదల (Depression) ద్విధ్రువ వ్యాధి (Bipolar disorder) మనోవైకల్యము (schizophrenia) వంటి వ్యాధులు ఊహాత్మకము కాదు. తెచ్చిపెట్టుకున్నవి కాదు. అవి నిజమైన రుగ్మతలే.

రుగ్మతలను నిరోధించడము, వ్యాధి నిర్ణయము చేయుట, వచ్చే వ్యాధులకు చికిత్స చేసి, నిర్మూలించడము, పూర్తిగా నయము కాని వానిని  అదుపులో పెట్టుట వైద్యుల లక్ష్యము. చికిత్సకు వ్యాధులు లొంగని పరిస్థితులలో (ఉదా; చికిత్సకు లొంగని కర్కటవ్రణములు) ఉపశమనము కలిగించి రోగుల బాధ నివారించుటకు యత్నము చేస్తారు.

రోగి బాధలను, రోగ చరిత్రను విని, రోగిని పరీక్షించి, అవసరమైన రక్త పరీక్షలు (Blood counts and Blood chemistry tests), యితర పరీక్షలు, ఎక్సరేలు (X-rays), శ్రవణాతీత ధ్వని చిత్రీకరణములు (Ultrasonography), హృదయ విద్యుల్లేఖనములు (electrocardiography) యింకా అధునాతనమైన గణనయంత్ర త్రిమితీయ చిత్రీకరణములు (Computerised axial tomography), అయస్కాంత ప్రతిధ్వని చిత్రీకరణములు (magnetic resonance imaging), అంతర్దర్శనములు

24 ::