పుట:Haindava-Swarajyamu.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పశుబలము.

95

దౌర్జన్యము ఫలమున నొక్కటే. ఇరువురును నాయాస్తి కొనిపోవువారే. అయిన తండ్రివిషయమగునేని కరుణారసము నేడ్పు కలుగును. మఱియొక్కడేని ఆగ్రహముకలిగి వైర ముత్పన్న మగును. ఇట్టిది చిత్రస్థితి. దీనినంతయు నాలోచింతుమేని సాధనము లిట్టివియే యుపయోగింప నగుననువిషయమున మనమేకీభవింపకపోవచ్చును. ఈయన్ని సందర్భములలో చేయవలసినది నాకు స్పష్టము. కాని నా సాధనము మీకు భయమును కలిగించవచ్చును. కాబట్టి మీకు తెలుపుటకు వెనుదీయుచున్నాను. మీరూహించుకొందురుగాక. అట్లూహకు తట్టదేని వేరువేరుసందర్భములలో వేరువేరుపాయముల చేసికొందురుగాక . ఒక్కటి మీకు విదితము, ఏయుపాయమైన నేమి యని మాత్రము ఉపయోగించుటకు రాదు. ప్రతిసందర్భమునకు ఆను గుణోపొయమునే మీ రాలోచించవలసియుందురు. కాబట్టి ఏయుపాయము చేత నైన వెదలగొట్టుట మీధర్మము కాదనుట స్పష్టము.

ఇంకను నాలోచింతము. ఆపాదమస్తకాయుధుడు మీసొత్తు దొంగిలించినాడు. మీచిత్త మావిషయమున మగ్నమయినది. మీ యాగ్రహ మనంతముగా పెరిగినది. మాస్వలాభమునకు గాక మీ ఇరుగుపొరుగువారి లాభమునకై వానిని మీరు దండింపవలె నందురు సాయుధులకొందరను చేర్చితిరి. పైబడి వానిఇల్లు స్వాధీనముచేసికొన నెంచితిరి. అది యతని